ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన “పెదరాయుడు” చిత్రం అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్, భానుప్రియ, సౌందర్య, రవీంద్ర బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 26 Years Completed Pedarayudu Movie-TeluguStop.com

కాగా ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ క్రమంలో దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లని సాధించింది.

 26 Years Completed Pedarayudu Movie-ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే ఈ చిత్రం విడుదలై 26 సంవత్సరాలు పూర్తవడంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను మరియు సినిమా షూటింగ్ ఫోటోలను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

దీంతో పలువురు మోహన్ బాబు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ఈ విషయంపై తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.

ఇందులో భాగంగా చిత్ర యూనిట్ సభ్యుల కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

అంతేకాకుండా 200 రోజులు ఫంక్షన్లో తీసినటువంటి ఫోటోలు షేర్ చేశాడు.అయితే ఈ ఫోటోలలో మంచు మనోజ్  తన తండ్రి మోహన్ బాబుతో పాటు ప్రముఖ సీనియర్ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ రజినీకాంత్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్ ప్రస్తుతం “అహం బ్రహ్మాస్మి” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

గత కొద్ది కాలంగా తన వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల కారణంగా మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించాడు.కాగా “అహం బ్రహ్మాస్మి” ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ పనులలో వాయిదా వేయడంతో కొంతమేర ఆలస్యం అయింది.

#Manchu Manoj #26Years #Mohan Babu #Rajanikanth #Aham Brahmasmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు