26/11కు పన్నెండేళ్లు.. న్యాయం చేయండి: జో బైడెన్‌కు ఎన్ఆర్ఐల విజ్ఞప్తి  

26/11..

TeluguStop.com - 26 11 Mumbai Terror Attack Indian Americans Held Protest In Front Of Capitol Hill

ఈ తేదీ గురించి తలచుకుంటే చాలు యావత్ భారతదేశం వణికిపోతోంది.ముంబై తాజ్ హోటల్ కాలిపోతున్న దృశ్యాలు, చేతిలో మిషన్ గన్‌తో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కళ్లముందు కనిపిస్తాడు.

ముంబై రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించిన 10 మంది ముష్కరులు ఏకే 47 తుపాకులతో కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చి చంపారు.అక్కడి నుంచి కామా హాస్పిటల్, ఒబెరాయ్, ట్రైడెంట్, తాజ్ హోటళ్లు, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల మారణ హోమం సృష్టించారు.

TeluguStop.com - 2611కు పన్నెండేళ్లు.. న్యాయం చేయండి: జో బైడెన్‌కు ఎన్ఆర్ఐల విజ్ఞప్తి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సుమారు మూడు రోజుల పాటు జరిగిన ఈ బీభత్సకాండలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.ఈ నరమేధం జరిగి నేటికి సరిగ్గా 12 ఏళ్లు.

ఉగ్రవాదులతో పోరాడుతూ హేమంత్ కర్కరే, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమీషనర్ అశోక్ కాంతే‌ వంటి ఉన్నతాధికారులు నేలకొరిగారు.

దారుణాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలో ఎన్ఆర్ఐలు రోడ్డెక్కారు.

వాషింగ్టన్ డీసీలోని పాకిస్తాన్, టర్కీ రాయబార కార్యాలయాల ముందు నిరసన చేశారు. ముంబై ఉగ్రదాడి వెనుక వున్న దేశాలను శిక్షించాలని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌కు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలపై ఇప్పటికైనా కఠిన చర్యలను తీసుకోవాలని ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తున్నారు.పాకిస్తాన్‌ను కట్టడి చేయకపోవడం వల్లే పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.

తీవ్రవాద దాడుల విషయాన్ని జో బైడెన్ దృష్టికి తీసుకుని రావాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిరసన చేపట్టినట్లు ప్రవాస భారతీయులు తెలిపారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇందుకు కారణాలు లేకపోలేదు.గతంలో బైడెన్ పాకిస్తాన్‌లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేయడంతో ఇస్లామాబాద్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.

అందుకే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని పాకిస్తాన్ గట్టిగా కోరుకుంది.దీనికితో తోడు 2008లో ఆ దేశం తన రెండో అత్యున్నత పురస్కారం ‘హిలాల్ ఇ పాకిస్తాన్ ’తో సత్కరించింది.గతంలో పాకిస్థాన్ కు 1.5 బిలియన్ల నాన్-మిలిటరీ సాయాన్ని అందించే కార్యాచరణ వెనుక బైడెన్, సెనేటర్ రిచర్డ్ లుగార్ ఉన్నారు.బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే… పాకిస్థాన్ కు గతంలో మాదిరి మంచి రోజులు వస్తాయని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

#Capitol Hill #Joe Biden #IndianNRI #Kamala Harries

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు