మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ(Visakhapatnam ) సిద్ధమైంది.అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీకి వేదికవుతోంది.74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది.ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో నేటి నుంచి 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు( ICID 25th Congress ) జరగనుంది.57 ఏళ్ల తరువాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు విశాఖ వేదికవడం విశేషం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.
ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy ) విశాఖ వస్తున్నారు.ఉదయం 8.05 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 8.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడ నుంచి హెలికాప్టర్‌లో మధురవాడ ఐటీ హిల్ నెంబర్.3లో ఉన్న హెలిప్యాడ్‌కి 9.15 గంటలకు చేరుకుంటారు.అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రుషికొండలోని రాడిషన్ బ్లూ రిసార్ట్‌కు వెళ్తారు.అక్కడ జరగనున్న 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్(ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీలో 9.30 గంటల నుంచి 11 గంటల వరకు పాల్గొంటారు.అనంతరం రోడ్డుమార్గంలో మధురవాడ హెలిప్యాడ్‌కు 11.15 గంటలకు చేరుకుంటారు.అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 11.35 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.11.45 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరుతారు