దేవుడా: అతని పొట్టలో 250గ్రా. ల ఇనుప వస్తువులు...!

ఈ మధ్యకాలంలో చాలా మందికి వారికి తెలియకుండానే ఏదో ఒక అనారోగ్యానికి గురి అవుతున్నారు.కొన్ని కొన్ని సార్లు వారి పొరపాటు ఏమీ లేకపోయినా వారి శరీరంలో ఏదో ఒక అవయవం దెబ్బతిని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.

 250gms Iron Instruments Found In Man Stomach, Iron Instruments, Stomach, Surgery-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా ఓ యువకుడి పొట్టలో ఏకంగా 35 ఇనుప వస్తువులను వైద్యులు గుర్తించారు.


ఇకపోతే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ ప్రాంతంలోని శుక్లా గంజ్ కు చెందిన ఓ యువకుడికి గత కొద్ది రోజుల నుండి కడుపు నొప్పి తీవ్రం కావడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరగా, అక్కడి వైద్యులు ముందుగా వైద్యంలో భాగంగా అతనికి స్కానింగ్ తీశారు.

ఇందులో భాగంగానే అతనికి కడుపులో ఏవో ఇనుప వస్తువులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.దీంతో ఇనుప వస్తువులను వెంటనే తీయకపోతే ప్రాణానికి ప్రమాదమని తెలపడంతో అతనికి శస్త్ర చికిత్స నిర్వహించారు.

మూడు గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో అతని పొట్టలో ఏకంగా 250 గ్రాముల బరువు ఉన్న 35 ఇనుప వస్తువులను బయటికి తీశారు.ఇందులో ఇనుప కడ్డీలు, చిన్న చిన్న ఇనుప మేకులను బయటకు తీశారు వైద్యులు.

ఈ శస్త్ర చికిత్స చేసే సమయంలో అతని పొట్టలో ఉన్న వాటిని చూసి వైద్యులు ఒకింత షాక్ కు గురయ్యారు.శస్త్రచికిత్స అనంతరం వైద్యులు తీసిన ఇనుప వస్తువులను కుటుంబ సభ్యులకు చూపగా వారు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.

అయితే ఇన్ని ఇనుప సామాన్లు అతని కడుపులోకి ఎలా చేరాయో అన్న విషయం మాత్రం తేలడం లేదు.కాకపోతే ఆ యువకుడు స్పృహలోకి వస్తే అసలు విషయం బయట పడనుంది.

ఏది ఏమైనా ఇనుప కడ్డీలు, అలాగే చిన్న చిన్న మేకులు కడుపులో ఉండటం నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube