చైతన్య సమంతలపై బ్రాహ్మజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. భరణంపై క్లారిటీ!

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత,నాగచైతన్య ల గురించి మనందరికీ తెలిసిందే.ప్రేమించి ఇరువురి కుటుంబ సభ్యుల మధ్యలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట గత ఏడాది గత ఏడాది ఊహించిన విధంగా ఒక్కసారిగా విడాకులు తీసుకుని విడిపోతున్నాము అంటూ ప్రకటించారు.

 250 Crores In Samantha Account Brahmaji Revealed Interesting Thing Details, Naga-TeluguStop.com

దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.అయితే వీరి విడాకులు తీసుకుని దాదాపు 11 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికీ అందుకు గల కారణం ఏంటి అనేది తెలియదు.

అయితే విడాకులు తర్వాత సమంత, నాగచైతన్యల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి.కాగా వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమా సమయంలో ఒకరిని ఒకరి ఇష్టపడ్డారు.

ఆ తర్వాత కొంతకాలం పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని నాలుగేళ్ల తర్వాత వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోయారు.ఇప్పటికీ వీళ్లిద్దరు విడిపోవడానికి గల అసలు కారణం ఏమిటి అన్నది తెలియదు.

అయితే విడాకుల తర్వాత నాగచైతన్య గురించి కంటే సమంత గురించి నెగటివ్ గా కామెంట్లు వినిపించాయి.ఆ కొద్ది రోజులపాటు సమంతని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేసారు.

కానీ సమంత మాత్రం ఆ విషయాలపై స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చింది.ఆ సమయంలో వీరిపై ఎన్నో రకాల కథనాలు వినిపించాయి.

మరి ముఖ్యంగా విడాకులకు కారణం ఇవే అంటూ కొన్ని వందల కథనాలు వినిపించాయి.

Telugu Brahmaji, Naga Chaitanya, Rumors, Samantha, Samanthanaga, Tollywood-Movie

కాగా విడాకులు తర్వాత సమంతకు నాగచైతన్య 250 కోట్లు భరణంగా కూడా ఇచ్చాడు అంటూ వార్తలు వినిపించాయి.అయితే సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వినిపించినా కానీ అటు సమంత కానీ ఇటు నాగచైతన్య కానీ స్పందించలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత నాగచైతన్య జంట గురించి నటుడు బ్రహ్మజీ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ చేశాడు.

అంతేకాకుండా సమంత గురించి తప్పుగా కామెంట్స్ చేసే వారికి చురకలు అంటించాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.నెటిజన్స్ సెలబ్రిటీల తో మాట్లాడేటప్పుడు నోరను అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.

Telugu Brahmaji, Naga Chaitanya, Rumors, Samantha, Samanthanaga, Tollywood-Movie

సెలబ్రిటీ జీవితం పై అయిన వ్యక్తిగతంగా కామెంట్స్ చేసే రైట్ మనకు లేదంటూ బ్రహ్మాజీ ఘాటుగా స్పందించారు.సమంత చాలా మంచిది,తన కష్టంతో తన టాలెంట్ తో పైకి వచ్చింది.ఆమెకి ఎవరు సహాయం అవసరం లేదు.

సమంత కూడా ఒక్క రూపాయి కూడా ఊరికే తీసుకోదు అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.అలాగే సెలబ్రిటీలతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నెటిజన్స్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.

ఏదో అవకాశం వచ్చింది కదా అని వాళ్ళని డౌన్ చేయడానికి మాట్లాడకూడదు.ఆ పాపం ఊరికే పోదు అంటూ గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేసే వారికి తనదైన సరిగా ఘాటుగా చురకలు అంటించాడు బ్రహ్మాజీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube