యాక్సెంచర్ కంపెనీ నుండి 25 వేలమంది టెకీలు అవుట్...!

కరోనా కోరలకు ప్రాణాలేకాదు ఉద్యోగాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి.ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు ప్రాజెక్ట్స్ లేక చేతులెత్తేశాయి.తమ ఉద్యోగులకు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ లాంగ్ లీవ్ ను ప్రకటించాయి.4 నెలల గడుస్తున్నా వారిని పిలవలేని పరిస్థితి.అర్ధం చేసుకున్న సదరు ఉద్యోగులు ఆల్టర్ నేటివ్ పనులు వెతుక్కునే పనిలో మునిగిపోయారు.కొందరైతే ఎంచక్కా పల్లెల్లో తమకున్న రెండు, మూడు ఎకరాల భూములను సాగుచేసుకుంటున్నారు.

 Accenture To Lay Off 25000 Employees, Accenture, Techies, Employees, Jobs, Ceo J-TeluguStop.com

ఇలాంటి గడ్డుకాలంలో మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ యాక్సెంచర్ తన ఉద్యగోలకు భారీ షాక్ ఇస్తూ.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులలో 5 శాతం మందిని తొలగించాలని అనుకున్నట్లు సమాచారం ఇచ్చింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీకి వున్న 5.13 లక్షల మంది ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు.వారిలో ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియక చాలా సతమతం అవుతున్నారు.ఇక తమ ఉద్యోగం మీద ఎక్కువ శాతం డౌట్ వున్నవారు ఇప్పటికే సామానులు సర్దుకుంటున్నారట.

Telugu Accenture, Accenturelay, Ceo Julie Sweet, Coronavirus, Covid, Employees,

ఇంటర్నల్ స్టాఫ్ సమావేశంలో పాల్గొన్న యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ మాట్లాడుతూ.ప్రపంచవ్యాప్తంగా 25 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాం.అని తెలిపారు.ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపు అనేది ఉంటుందని వారు చెబుతున్నా, దానికి కారణం కరోనానే అని వేరే చెప్పనక్కర్లేదు.యాక్సెంచర్‌ కు దాదాపు భారత్‌ లోనే రెండు లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు.దీంతో ఈ ప్రభావం మన దేశంలోని ఉద్యోగులపై ఎక్కువగా పడే అవకాశం లేకపోలేదు.

దీనితో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 25000 ఉద్యోగులకు పైగా ఎసరు పడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube