25 సంవత్సరాల నాటి వీడియో గేమ్ 11 కోట్లా..?

ఇప్పుడు పిల్లల దగ్గర నుండి కుర్రాళ్ళ వరకు ఎవరు చుసిన ఫోన్లో గేమ్స్ ఆడడం గాని వీడియో గేమ్స్ ఆడడం గాని మనం చూసే ఉంటాము.కాస్త సమయం దొరికితే చాలు వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 25 Crore Video Game 11 Crores  Super Mario 64, Video Game, Playing, Social Media-TeluguStop.com

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో గేమ్ బాగా ఫేమస్ అయిన వీడియో గేమ్.కానీ ఇప్పటిది కాదు.

చాలా పాతకాలపు గేమ్ అది.అంటే దాదాపు ఒక పాతికేళ్ల నాటి వీడియో గేమ్ అన్నమాట.కానీ ఇప్పటికి ఈ వీడియో గేమ్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు అని చెప్పడానికి ఈ వేలంపాట ఒక ఉదాహరణ లాంటిది.ఈ వీడియో గేమ్ ను వేలం వేయగా ఏకంగా 11 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది అంటే మీరే ఆలోచించండి ఈ గేమ్ ఎంత పాపులర్ అయిందో అని.ఇంతకీ ఆ వీడియో గేమ్ పేరు ఏంటి దానిని ఎవరు రూపొందించారు అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

వీడియో గేమ్ లు, వాటిని ఆడే కన్సోల్స్ తయారీలో జపాన్ కి చెందిన నింటెండో సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.

1977 లో ఈ సంస్థ తొలి వీడియో గేమ్ విడుదల చేసింది.తరువాత మెల్లగా అభివృద్ధి చెంది ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల ఎలక్ట్రానిక్ మార్కెట్లలో ఎక్కడ చూసినా నింటెండో వీడియో గేములు, గేమింగ్ కన్సోల్స్ దర్శనం ఇచ్చేవి.

Telugu Mario, Game, Latest-Latest News - Telugu

అసలు విషయానికి వస్తే ఈ సంస్థ 1996లో తయారుచేసిన సూపర్ మారియో-64 గేమింట్ కన్సోల్ ను ఇటీవల వేలం వేయగా ఒక అజ్ఞాత వ్యక్తి ఆ నింటెండో సూపర్ మారియో-64 గేమింట్ కన్సోల్ ను ఏకంగా రూ.11.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు.ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు అంటే అప్పట్లో ఈ వీడియో గేమ్ ఒక దుమ్ము దులిపింది అనే చెప్పాలి.అలాగే నింటెండో సంస్థకు బాగా పేరు తెచ్చిపెట్టిన వీడియో గేమింగ్ కన్సోల్స్ లో సూపర్ మారియో-64 ముఖ్యమైంది.

అందుకె ఈ గేమ్ అత్యంత విలువైనదిగా పేరు తెచ్చుకుంది.అమెరికాలోని టెక్సాస్ హెరిటేజ్ సంస్థ ఈ వేలం నిర్వహించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube