అక్కడ 130 ఏళ్ల తర్వాత మమ్మీ కదిలింది.. దేనికి సంకేతం?

ఏంటి నిజామా? అని ఆశ్చర్యపోతున్నారా.అక్కడికే వస్తున్న! మమ్మీ కదలలేదు.

 2,400-year-old Egyptian Mummy Unboxed In Jaipur , 2400 Year Old Mummy, Jaipur, F-TeluguStop.com

కొన్ని ఊహించని కారణాల వల్ల మమ్మీని అధికారులు కదపాల్సి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

జైపూర్ లో 2,400 ఏళ్ళ వయసున్న మమ్మీ ఉన్న సంగతి తెలిసిందే.ఆ మమ్మీని దాదాపు 130 ఏళ్ల తర్వాత ఉన్న చోటు నుంచి కదిలింది .

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మమ్మీని సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలించారు.ఈ మమ్మీని ఈజిప్టులోని పురాతనమైన పనో పోలీస్ నగరంలోని పిరమిడ్స్‌లో గుర్తించారు.130 ఏళ్ల క్రితం ఈ మమ్మీని భారత్ లోని జైపూర్ కు తరలించారు.జైపూర్‌లోని మ్యూజియంలో ఈ మమ్మీని ఓ గాజు పెట్టెలో పెట్టి భద్రపరిచారు.

అప్పుడు ఎప్పుడో కదిలించిన ఈ మమ్మీని ఇప్పటివరకు ఎవరు కదిలించలేదు.కానీ ఇటీవల జైపూర్‌లో భారీ వర్షాలు కురిశాయి.దీంతో వరదనీరు మ్యూజియంలోకి వచ్చి చేరింది.దీంతో మమ్మీ ఉన్న పెట్టెలోకి వరద నీరు చేరుతుందని అందుకే వారు ఆ గాజు బాక్స్ ను బద్దలు కొట్టి తరలించినట్టు తెలిపారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.గత 130 ఏళ్లుగా జరగని ఈ ఘటన ఇప్పుడు జరగడం ఏంటి.ఇది దేనికి సంకేతం.ఈ 2020 ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే అవి వారి అపోహలే తప్ప నిజాలు కావు అని.ఇది కేవలం భద్రపరచడం కోసమే చేసినట్టు అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube