ట్రావెల్ ఏజెంట్ మోసం: దేశం కానీ దేశంలో భారతీయుడి ఇబ్బందులు.. ఎట్టకేలకు ఇండియాకి

కెనడాకు పంపే నెపంతో ఓ 24 ఏళ్ల వ్యక్తిని మోసానికి పాల్పడ్డారే ఆరోపణలపై ఓ ట్రావెల్ ఏజెంట్ అతని భార్యపై పంజాబ్ మానవ అక్రమ రవాణా నిరోధకం చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.పాటియాలకు చెందిన 24 ఏళ్ల రాజ్‌వీందర్ సింగ్‌ను జాగ్రూప్ సింగ్ అనే ఏజెంట్ ఉక్రెయిన్ మీదుగా కెనడాకు పంపిస్తానని హామీ ఇచ్చాడు.

 24 Years Old Punjabi Man Cheated By Travel Agent In Patiala-TeluguStop.com

ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పాడు.

కానీ నిందితుడు ఉక్రెయిన్‌‌లో 15 రోజుల టూరిస్ట్ వీసా మాత్రమే ఏర్పాటు చేశాడని రాజ్ వివరించాడు.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి అతను మాకు పీఆర్ ఇచ్చి కెనడాకు పంపించాల్సి ఉంది.అయితే జాగ్రూప్ సింగ్ ఆలస్యం చేస్తుండటంతో తాము 2 నెలల పాటు ఉక్రెయిన్‌లోనే ఓ అద్దె ఇంటిని తీసుకుని నిరీక్షించామని రాజ్ అన్నాడు.

ఆ తర్వాత కొద్దిరోజులకు ఉక్రెయిన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తాము ఉంటున్న అద్దె ఇంటిపై దాడి చేసి మమ్మల్ని వారి కార్యాలయానికి తీసుకెళ్లారు.

అక్కడ వారు చట్టవిరుద్ధంగా ఉక్రెయిన్‌లో నివసిస్తున్నందుకు గాను ఆ దేశంలో తిరగకూడదని నిషేధం విధించడంతో పాటు వారం లోపు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించారు.

దీంతో తామంతా ఆర్మేనియాకు వెళ్లి అక్కడ సొంత ఖర్చులతో 7 నెలల పాటు ఉండాల్సి వచ్చిందని రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.తర్వాత తాను బెలారస్‌ మీదుగా భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని అయితే అధికారులు తనను విమానాశ్రయంలోని జైలులో రెండు రోజుల పాటు నిర్బంధించారని రాజ్‌వీందర్ ఉద్వేగంగా చెప్పాడు.

Telugu Punjabitravel, Patiala, Punjabi, Telugu Nri, Travel-Telugu NRI

ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత 2019 ఆగస్టులో ట్రావెల్ ఏజెంట్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని , ఈ సమయంలో జాగ్రూప్ సింగ్ తన డబ్బును తిరిగి చెల్లించేందుకు అంగీకరించాడని తెలిపాడు.అయితే ఆ తర్వాత డబ్బు చెల్లించకుండా కాలయాపన చేయడంతో పోలీసులు అతని వ్యవహారాలపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు.కెనడా వెళ్లేందుకు గాను రాజ్‌వీందర్ సింగ్ నిందితుడికి రూ.12.4 లక్షలు చెల్లించాడు.ఈ దందాలో మిగిలిన నిందితులను పట్టుకోవడానికి దాడులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube