ఆ 29 గ్రామాలకు 24X7...!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా ఇప్పటికే 29 గ్రామాలను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.ఆ 29 గ్రామాలను కొన్ని రోజులుగా రాజధాని గ్రామాలు అంటూ పిలుస్తున్నారు.

 24 Hours Power To Capital Cities In Ap-TeluguStop.com

ఇప్పటికే ఆ గ్రామాలకు మహర్ధశ పట్టింది.అనేక వసతులు ఆ గ్రామాలకు వచ్చాయి.

తాజాగా మరో ఆఫర్‌ రాజధాని గ్రామాలు కొట్టాయి.వేసవి సమీపిస్తున్న వేల ప్రభుత్వం కరెంటు కట్టింగ్‌లను మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది.

మూడు నుండి ఆరు గంటల కరెంటు కోతలు విధించాల్సిందిగా విద్యుత్‌ శాఖ భావిస్తోంది.

రాష్ట్రం మొత్తం విద్యుత్‌ కోతలు ఉన్నా కూడా రాజధాని గ్రామాలైన ఆ 29 గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్‌ ప్రసారం కల్పించాల్సిందిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ విద్యుత్‌ శాఖను ఆదేశించాడు.

రాజధాని గ్రామాలు అవ్వడంతో విద్యుత్‌ ప్రసారం నిరంతరాయంగా కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందని నారాయణ పేర్కొన్నాడు.మొత్తానికి రోజులో 24 గంటలు కరెంటుతో రాజధాని గ్రామాల వాసులు వేసవిని చల్లగా గడపబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube