సరదా కోసం తుపాకీ తో ఫోటో అనుకోకుండా  

23 Yr Old Woman Sustains Bullet Injurie-durga Nagar,hospital,janvi,subash Thomar,sustains Bullet Injuries,viswajith

జనాలు తమ సరదాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకొనే ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వారి సరదాల కోసం కొందరు ప్రాణాలను సైతం పోగొట్టుకొనే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఒక సరదానే ఒక మహిళ ప్రాణం మీదకు తెచ్చింది..

సరదా కోసం తుపాకీ తో ఫోటో అనుకోకుండా-23 Yr Old Woman Sustains Bullet Injurie

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆగ్రా లోని దుర్గానగర్ కాలనీ లో జాన్వీ అనే మహిళ ఏడాది క్రితం విశ్వజిత్ తోమర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే విశ్వజిత్ తండ్రి శుభాష్ తోమర్ సైన్యంలో విధులు నిర్వహిస్తుంటాడు.

ఈ క్రమంలో అతడి లైసెన్స్డ్ గన్ అందుబాటులో ఉండడం తో జాన్వి దానితో ఫోటో దిగాలని సరదా పడి మేనకోడలు డాలీ ని ఫోటో తీయమని చెప్పింది. ఈ క్రమంలో ఫోటో కు స్టిల్ ఇవ్వబోయిన జాన్వి పొరపాటున ట్రిగ్గర్ నొక్కడం తో ఆమె శరీరంలోకి తూటా దూసుకెళ్లింది.

దానితో ఒక్కసారిగా జాన్వి కుప్పకూలడం తో రక్తపు మడుగు లో ఉన్న మేనత్తను చూసిన డాలీ పెద్దగా కేకలు పెట్టడం తో చుట్టుపక్కల వారంతా అక్కడకి చేరుకుని జాన్వి ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బుల్లెట్ ఆమె గుండెకు దగ్గరగా దూసుకెళ్లింది అని,దీనితో ఊపిరితిత్తులు పాడయ్యాయని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సరదాగా ఫోటో దిగుదాం అని అనుకున్న జాన్వి ఇప్పుడు ప్రాణాలతో కొట్టుకుంటుంది.