షాకింగ్ - కాఫీతో మనిషిని చంపొచ్చు

కాఫీలో కెఫైన్ ఉంటుదన్న సంగతి మనందరికి తెలిసిందే.యుక్త వయస్సులో ఉన్నవారు రోజుకి 400 మిల్లిగ్రాముల దాకా కెఫైన్ ని తీసుకుంటే చాలా మంచిది.

 23 Litres Of Coffee Can Kill A Human Body-TeluguStop.com

మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది కాఫీ.అందులో సందేహం లేదు.

కాని కాఫీ ఎక్కువగా తాగితే మాత్రం చాలా ప్రమాదం.కేవలం మీ ఆరోగ్యానికే కాదు, ఈ ప్రాణానికి కూడా.

గట్టిగా చెప్పాంటే కేవలం కాఫీ తాగి ఓ మనిషి చనిపోవచ్చు, తాగించి ఓ మనిషిని చంపొచ్చు.

తక్కువ సమయంలో ఎవరైన 23 లీటర్ల కాఫీ తాగితే, అది వారి ప్రాణాన్ని తీసేస్తుంది.23 లీటర్లంటే 80-100 కప్పుల కాఫీ అన్నమాట.అందులో ఎంతలేదన్నా 13-15 గ్రాముల కెఫైన్ ఉంటుంది.

రోజుకి 400 మిల్లిగ్రాముల కెఫైన్ మన ఒంటికి మంచిది.అలాంటిది 13-15 గ్రాముల కైఫైన్ ఒంట్లో పడితే బతికి బట్టకట్టడం చాలా కష్టమైన విషయం.

నిజానికి 23 లీటర్ల ద్రవపదార్థం మీ ఒంట్లో ఉండటం కష్టం.ఎప్పటికప్పుడు వాంతులు అవుతుంటాయి.

అయినా, కాఫీ అంతమొత్తంలో తీసుకుంటే ఇక ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పాల్సిందే.

అందుకే కాఫీ ఎంతవరకు తాగాలో అంతవరకే తాగాలి.

అతిగా వేసుకుంటే ఔషదం కూడా విశమవుతుందని ఊరికే అనలేదుగా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube