మీరు సినిమా ప్రియులా? రేపు ఒక్క రోజే ఓటీటీలో 23 సినిమాలు, సీరిస్ లు.. వివరాలు ఇవే!

సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే సినీ ప్రియులకు సినిమా అంటే కొత్త లోకంగా భావిస్తారు.

 23 Films And Series Release From Tomorrow On Ott Full Details, Ott Releases, Tol-TeluguStop.com

నిజానికి సినిమాలు చూడటానికి చాలామంది అభిమాన నటుల సినిమాలయితేనే ఇష్టపడతారు.కొందరు మంచి కంటెంట్ ఉంటే సినిమా చూడడానికి ఇష్టపడతారు.

కానీ మరి కొంతమంది ప్రతి వారం వచ్చిన సినిమాలను చూడటానికి ఇష్టపడతారు.నిజానికి అది వారికి ఒక వ్యసనం అని చెప్పవచ్చు.

అలా వచ్చేవారం ఏ సినిమా విడుదలవుతుందో అని ముందుగానే సర్చ్ లు చేసి వారం ముందే హడావుడిగా కనిపిస్తూ ఉంటారు.ముందుగానే టికెట్లు బుక్ చేసి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక అలాంటి వారి కోసం రేపు తీపి కబురు అని చెప్పవచ్చు.అదేంటంటే రేపు ఒక్క రోజే ఓటీటీలో 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

ప్రస్తుతం థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే.నిజానికి చాలామంది థియేటర్లో విడుదలయ్యే సినిమాల కంటే ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటీటీ బాగా అలవాటయింది.థియేటర్లోకి వెళ్లి చూడటం కంటే ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు.

థియేటర్లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ లో కూడా తొందరగానే స్ట్రీమింగ్ కావడంతో ప్రేక్షకులు కాస్త ఆలస్యమైన సరే అని ఓటీటీ లో చూడటానికి ఇష్టపడుతున్నారు.ఇక ముఖ్యంగా రేపు మాత్రం సినీప్రియులకు శుభవార్త అని చెప్పవచ్చు.

అది కూడా ఓటీటీ ప్రేక్షకులకే అని ముందుగా చెప్పవచ్చు.

ఇక రేపు అనగా అక్టోబర్ 7న ఏకంగా 23 సినిమాలు, సిరీస్ లుప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అందులో సినిమాలతో పాటు సీరిస్ లు కూడా ఉన్నాయి.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఇలా ప్రపంచవ్యాప్త భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇంతకు ఆ సినిమాలు ఏంటో సీరిస్ లు ఏంటో తెలుసుకుందాం.

దొంగలున్నారు జాగ్రత్త.

ఈ సినిమా తెలుగుతోపాటు మలయాళం లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఇక కన్నడ సినిమా అయిన లక్కీ మ్యాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

ఇక కొరియన్ సినిమా గ్లిట్చ్ నెట్ఫ్లిక్స్ లో రానుంది.ఇంగ్లీష్ సినిమా ద జెఫ్రీ దాహ్మర్ టేప్స్ కూడా నెట్ ఫ్లిక్స్ లో రానుంది.

మరో ఇంగ్లీష్ సిరీస్ ద మోల్, ద మిడ్ నైట్ క్లబ్, డెర్రీ గర్ల్స్, ఆడ్ బాల్స్, మ్యాన్ ఆన్ పాస్, లక్కీఎస్టు గర్ల్స్ అలీవ్, ద రీడిమ్ టీం లు నెట్ఫ్లిక్స్ లో రానున్నాయి.ఇక జపనీస్ మూవీ టైగర్ అండ్ బన్నీ కూడా నెట్ ఫ్లిక్స్ లో రానుంది.ఇక జర్మన్ సినిమా ఓల్డ్ పీపుల్, ఫిలిప్పినో సినిమా డాల్ హౌస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.ఇక ఇంగ్లీష్ సినిమా కి ఆడమ్స్: ద రియల్ మీ కూడా నెట్ ఫిక్స్ లో విడుదల కానుంది.

ఇక హిందీ సినిమా ఫీల్స్ లైక్ హోమ్ లయన్స్ గేట్ ప్లే లో విడుదల కానుంది.ఇక ఇంగ్లీష్, హిందీలో రూపొందిన ప్రే సినిమా హాట్ స్టార్ లో విడుదల కానుంది.మరో ఇంగ్లీష్ సినిమా వర్ ఉఫ్ బై నైట్ కూడా హాట్స్టార్ లో రానుంది.ఇక లాల్ సింగ్ చద్దా తెలుగు, హిందీ, తమిళ భాషలో నెట్ఫిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

హిందీ మాజామా సినిమా ప్రైమ్ వీడియోలో రానుంది.ఇంగ్లీష్ సినిమా ద సౌండ్ ఆఫ్ 007 కూడా ప్రైమ్ వీడియోలో రానుంది.

తెలుగు సిరీస్ ఎక్స్పోజ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఒట్టు /రెండోగా అనే ఈ సినిమా మలయాళం తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube