ఆమెకి 32 అతడికి 22..అసలు ట్విస్ట్ ఏమిటంటే       2018-04-28   04:38:09  IST  Raghu V

సమాజంలో ఎన్ని మోసాలు జరుగుతున్నా సరే ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ప్రజలని అలెర్ట్ చేస్తున్నా..మోసపోయిన భాదితులు కళ్ళ ముందు తిరుగుతున్నా సరే పరిపక్వత లేని మనుషులు మోసాలని గ్రహించలేక పోతున్నారు , మోసపోతూనే ఉన్నారు..ఇలాంటి ఎన్నో సంఘటనలు గంటకి ఒకటి దేశంలో జరుగుతూనే ఉన్నాయి..ఎన్నో సంఘటనలు పోలీసు రికార్డులకేక్కుతున్నాయి..మరెంతో మంది ప్రాణాలు ఆవిరై పోతున్నాయి..

అయితే తాజాగా జరిగిన ఉదంతం వీటన్న్తికి భిన్నంగా ఉంది..తనకంటే చిన్న వాడిన ఒక యువకుడిని ప్రేమించిన యువతి చివరకు మోసపోయి పోలీసులని ఆశ్రయించిన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..వివరాలలోకి వెళ్తే.. మండలం చిన్నదిమిలి గ్రామానికి చెందిన తూరుబాటి మనోజ్‌కుమార్‌ (22) అనే యువకుడు తనకంటే పెద్దదైన చిన్నదిమిలి గ్రామానికి చెందినా 32 ఎల్లా మహిళని ప్రేమించాడు

అయితే ప్రేమ పేరు చెప్పి నమ్మించి మోసం చేశాడని సదరు మహిళా పోలీసులకి ఫిర్యాదు చేసింది..పెళ్లి చేసుకోమని కోరితే యువకుడు, వారి కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించారని అంతటితో ఆగకుండా తనపై దాడి కూడా చేశారని.ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు మేరకు డీఎస్పీ చిన్నదిమిలి గ్రామానికి శుక్రవారం వచ్చారు. గ్రామస్థులను, బాధితులను విచారించారు. గ్రామస్థుల వాగ్మూలం ఆధారంగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడు, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.