స్వదేశానికి చేరుకుంటున్న భారతీయ సంపద.. 2014 నుంచి ఎన్ని వచ్చాయంటే : కేంద్రం ప్రకటన

229 Antiquities Retrieved From Foreign Countries Since 2014 Says Union Minister Kishan Reddy, Antiquities , Kohinoor , Antony Blinken , America , Union Minister Kishan Reddy , Foreign Countries

కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.

 229 Antiquities Retrieved From Foreign Countries Since 2014 Says Union Minister-TeluguStop.com

నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.

వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.

కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.

విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.

Telugu America, Antony Blinken, Central, Foreign, Hanuman Statue, Kohinoor, Kish

అలా 2014 నుంచి విదేశాల నుంచి మొత్తం 229 పురాతన కళాఖండాలు, వస్తువులు తిరిగి భారతదేశానికి చేరుకున్నాయి.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటన చేసింది.ఇంగ్లాండ్‌లో వున్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తోందా అన్న ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానం అందించారు.

భారత్ నుంచి తరలిపోయిన అపురూప వస్తువులను తిరిగి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.భారతీయ మూలానికి సంబంధించిన ఏదైనా ప్రాచీనత విదేశాల్లో కనిపించినప్పుడల్లా.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాటిని భారత రాయబార కార్యాలయాలు, విదేశాల్లోని మిషన్‌ల ద్వారా తిరిగి పొందేందుకు విదేశాంగ శాఖ చొరవ చూపుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Telugu America, Antony Blinken, Central, Foreign, Hanuman Statue, Kohinoor, Kish

గతేడాది దీపావళి సందర్భంగా 500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహాన్ని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అప్పగించిన సంగతి తెలిసిందే.గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు కలిసి ఈ హనుమాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.దక్షిణ భారతదేశంలోని ఓ ఆలయంలోంచి 500 ఏళ్ల నాటి ఈ హనుమాన్ విగ్రహాన్ని కొందరు దొంగిలించారు.

అనంతరం దానిని ఖండాలు దాటించి అమెరికాలోని క్రిస్టీ ఆక్షన్ హౌస్‌కు విక్రయించారు.దీనిని వేలానికి పెట్టగా.ఒక ఆస్ట్రేలియా పౌరుడు కొనుగోలు చేశాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube