ఈ మధ్య కాలంలో కొందరు అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇతరుల జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. కాగా తాజాగా ఓ యువతి పెళ్ళి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని కేపీహెచ్బీ పరిసర ప్రాంతంలో సోనాలి (పేరు మార్చాం) అనే 22 సంవత్సరాలు కలిగిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.ఈ మధ్యకాలంలో సోనాలి కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేసేందుకుగానూ సంబంధాలను చూస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని పెళ్లి సంబంధాల వారు సోనాలి ని పెళ్లిచూపులు చూడడానికి వస్తు వెళుతూ ఉన్నారు.దీంతో తన తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినప్పటికీ తనకి పెళ్లి కుదరకపోవడంతో సోనాలి తీవ్ర మనస్తాపానికి గురైంది.
దీంతో సోనాలికుటుంబ సభ్యులు ఆమెతో తొందర్లోనే అంతా సర్దుకుంటుందని సర్ది చెప్పినప్పటికీ సోనాలి వినకుండా తనలోతానే మదనపడుతూ ఉండేది.

ఈ క్రమంలో సోనాలి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.దీంతో పని నిమిత్తమై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సోనాలి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం గమనించిన ఇతర కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.పెళ్లీడుకొచ్చిన కూతురుని పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన సమయంలో ఇలా కాఠికి తీసుకెళ్లాల్సి వచ్చిందని సోనాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.