కెనడా : వారం క్రితం అదృశ్యం... చివరికి కారులో శవమై తేలిన భారతీయ యువకుడు

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.వారం క్రితం అదృశ్యమైన భారతీయ యువకుడు కారులో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు.

 22 Years Old Indian Man Found Dead Under Mysterious Circumstances Inside Car In-TeluguStop.com

మృతుడిని జస్కరణ్ సింగ్‌గా గుర్తించారు.పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన జస్కరణ్‌ నాలుగేళ్ల క్రితం కెనడాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాడు.

అనంతరం అక్కడ పర్మినెంట్ రెసిడెన్సీని పొంది ఇటీవలే వ్యాపారం ప్రారంభించాడు.అయితే దాదాపు వారం రోజుల నుంచి జస్కరణ్ కనిపించకుండా పోయాడు.

దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో కెనడాలోని కాల్గరీ ప్రాంతంలో రోడ్డు పక్కన పార్కు చేసి వున్న కారులో అనుమానాస్పద స్థితిలో వున్న జస్కరణ్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.

ఆయన మరణవార్త తెలుసుకున్న పంజాబ్‌లోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.జస్కరణ్ తండ్రి జస్వంత్ సింగ్ జోసన్ లోహియన్ ఖాస్ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ ఘటనపై జస్వంత్ మాట్లాడుతూ.జస్కరణ్ కెనడాలో నాలుగేళ్లుగా వుంటూ అక్కడ పనిచేస్తున్నాడని చెప్పాడు.

కొద్దిరోజుల క్రితం అతను అదృశ్యం కావడంతో రూమ్‌మేట్స్ తీవ్రంగా గాలించారని, అలాగే ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోందని చెప్పారు.

Telugu Canada, Car, Indian, Jalandhar, Jaskaran Singh, Jaskaransingh, Jaswanthsi

తన కుమారుడి క్షేమ సమాచారం కోసం ఆందోళన చెందుతున్న సమయంలో అతని మరణవార్తను పోలీసులు తమకు తెలియజేశారని జస్వంత్ ఆవేదన వ్యక్తం చేశారు.కెనడా పోలీసుల నుంచి మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.త్వరలోనే తాము కెనడాకు వెళ్తామని జస్వంత్ చెప్పారు.ఇదిలావుండగా… గత వారం కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు.

డిసెంబర్ 13న ఉదయం 7 గంటలకు మిస్సిసాగాలోని కోర్ట్నీ పార్క్ డ్రైవ్ , ఎడ్వర్డ్స్ బౌలే‌వార్డ్ వద్ద ఓ రవాణా ట్రక్ ఢీకొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.మిస్సిసాగాలోని ఒక ఫ్యాక్టరీలో మన్‌ప్రీత్ పనిచేస్తున్నాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube