పాకిస్తాన్ లో 22 టెర్రరిస్ట్ క్యాంపులు యాక్టివ్! ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్ర వాద సంస్థ ఆత్మాహుతి దాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉగ్ర వాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడులలో చాల వరకు ఉగ్ర స్థావరాలు నేలమట్టం అయ్యాయని, ఇక మూడు వందల మంది వరకు ఉగ్రవాదులు మరణించారని భారత్ ప్రభుత్వం చెబుతుంది.

 22 Terrorist Training Camps Active In Pakistan-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈ ఎయిర్ స్ట్రైక్ ని రాజకీయ పార్టీలు తమకి తాముగా వాడుకుంటున్నాయి.ఇదిలా వుంటే పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాల గురించి ఇప్పుడు నిఘా సంస్థలు ఆసక్తికరమైన నిజాలు బయట పెట్టాయి.

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇప్పటికి 22 వరకు ఉగ్ర స్థావరాలు యాక్టివ్ గా వున్నాయని, అందులో 9 జైషే మహ్మద్ ఉగ్ర వాద సంస్థ నిర్వహిస్తుందని నిఘా వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.అలాగే ఈ ఉగ్ర వాద సంస్థలన్నింటికి కూడా పాకిస్తాన్ సహకారం వుందని తెలియజేస్తుంది.

ఈ ఉగ్రవాద సంస్థలలో భారత్ పై దాడులకి ప్రేరేపించే విధంగానే ఉగ్రవాద శిక్షణ ఉంటుందని కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube