కరోనా అంతం చేసే దిశగా 22 రాష్ట్రాలు ..భారీగా తగ్గిన పాజిటివిటీ రేటు !

కరోనా మహమ్మారి ప్రభావంతో గత కొన్నిరోజులుగా ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది.ఇక మన దేశంలో కూడా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది.

 Corona , Covid19, India , Amerika,-TeluguStop.com

మరికొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికాను దాటి మొదటి స్థానంను ఆక్రమించే అవకాశం ఉంది.దాదాపుగా 70 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ తరుణంలో దేశంలో లోని 22 రాష్ట్రాలు కరోనాను జయించే దిశగా నడుస్తున్నాయి అని కేంద్రం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్ పాజిటివ్ రేటు, గత 11 రోజుల వ్యవధిలో 8.2 శాతానికి తగ్గితే, ఈ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 శాతానికన్నా తక్కువకుగా ఉందట.ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన రూల్స్ ప్రకారం, ప్రతి పది లక్షల మందిలో రోజుకు 140 మందికి టెస్ట్ ల చేయించాలని అయితే దానికంటే ఎక్కువ కరోనా నిర్దారణ పరీక్షలను చేయిస్తున్నామని వెల్లడించింది.

మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం భారత్ లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయింది అని , చాలా ప్రాంతాల్లో వైరస్ కట్టడి విజయవంతంగా జరుగుతోందని, ఇప్పుడు రోజుకు ప్రతి పది లక్షల మంది జనాభాలో 865 మందికి టెస్టులు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది .జూన్ , జులై నెలలతో పోలిస్తే, కరోనా పాజిటివ్ రేటు ఇప్పుడు గణనీయంగా తగ్గిందని, ఈ రేటు మరింతగా తగ్గితే, కరోనాను చాలా రాష్ట్రాలు జయించినట్టేనని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube