ఇంటికి రానిచ్చిన పాపానికి 21 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల వ్యక్తితో ఉన్న చనువుతో ఏం చేసిందంటే.? సీసీ కెమెరాలే వాళ్లను పట్టించాయి   21 Years Girl Illegal Affair With 60 Years Men     2018-07-10   23:49:03  IST  Raghu V

పట్టుమని 21 సంవత్సరాలు నిండని యువతి పక్కా పథకం ప్రకారం దోపిడీకి పాల్పడింది. మచిలీపట్నంలో మూడు రోజుల క్రితం వృద్ధురాలిపై దాడి, దోపిడీ కేసులో ఒక యువతి కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.వివరాలు ఇలా ఉన్నాయి.

ఆమె పేరు బాలసాయి. కుటుంబంతో సహా మచిలీపట్టణం కి వచ్చి స్థిరపడింది. ప్రస్తుతం డిగ్రీ కరస్పాండెంట్‌ కోర్సులో చదువుతోంది. ఈమె మచిలీపట్నానికి చెందిన నాయుడు లక్ష్మీనారాయణ (60) వద్ద పనిలో చేరింది. వీరిద్దరూ ఐడియా షో రూంలో పనిచేసే వారు. వీరిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం పెరిగింది. దీంతో స్థానికంగా ఉన్న మీడియాలో బాలసాయిని చేర్పించాడు. ఆమె మచిలీపట్నంలోని చల్లరాస్తా సెంటర్‌ సమీపంలో ఉన్న అతని ఇంటికి వెళుతూ ఉండేది. ఆ ఇంటిలో లక్ష్మీనారాయణ తల్లి నాయుడు నరసమ్మ(82) ఒంటరిగా ఉంటున్నట్లు గమనించింది. ఆమె ఒంటిపై బంగారం ఉందాటటంతో ఎలాగైనా కొట్టేయాలి అనుకుంది. ఒక పథకం పన్నింది. అదేంటి అంటే.

దోపిడీ చేయటానికి నాలుగు రోజుల ముందు తన మేనత్త, తమ్ముడు(జువైనల్‌)తో ఆ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది. దోపిడీ జరిగిన ముందు రోజు కూడా వచ్చి, దోపిడీకి ప్రయత్నం చేశారు. అయితే వారి వల్ల కాకపోవటంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు అన్ని విధాల సిద్ధపడి వచ్చారు. చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించారు. అలాగే నోట్లో పెట్టి మాట రాకుండా చేయటానికి దుస్తులు తెచ్చారు. కళ్లు కనపడకుండా, అరవ కుండా చేయటానికి హిట్‌ను వెంట తెచ్చుకున్నారు.

అదే సమయంలో ఇంట్లో లక్ష్మీనారాయణ ఉండటంతో, అతన్ని మభ్యపెట్టేందుకు బాలసాయి మరో పథకాన్ని వేసింది. వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, మరింతగా మాటలు కలిపింది. టీవీ సౌండ్‌ను అధికం చేసింది. అనంతరం వృద్ధురాలు స్నానానికి వెళ్లిన సమయం చూసి తన మేనత్త, తమ్ముడిని లోపలికి తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టింది. వృద్ధురాలు లోనికి వచ్చిన వెంటనే ఆమె నోరుమూసి కళ్లలో, నోట్లో హిట్‌ కొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. మేనత్త, తమ్ముడు ఇరువురూ గొలుసు, గాజులు, ఉంగరాలు లాక్కుని పరారయ్యారు.

ఇదంతా పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలో రికార్డు అయింది. కేసును అన్ని కోణాల్లో పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దొంగిలించిన సొత్తు వారినుంచి రికవరీ చేశారు.