కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్ధి మృతి, విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి

కెనడాలో దారుణం జరిగింది.టొరంటోలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి మృతిచెందాడు.

 21 Year Old Indian Student Shot Dead In Canada, Indian Student , Canada, Karthik-TeluguStop.com

నగరంలోని సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అనంతరం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

కార్తీక్ వాసుదేవ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ చదివేందుకు జనవరిలో కెనడాకు వెళ్లాడు.సెనెకా కాలేజీలో ప్రస్తుతం ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నాడు.

ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు భారత విద్యార్థి మరణం పట్ల టోరంటోలోని ఇండియన్ ఎంబసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

కార్తీక్ మృతదేహాన్ని భారత్‌కు త్వరగా పంపించేందుకు తమవంతు సహకారం అందిస్తామని ప్రకటించింది.అటు ఈ కాల్పుల ఘటన పట్ల విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు.

వాసుదేవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇకపోతే.

కొద్దిరోజుల క్రితం కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.ఒంటారియోలో మార్చి 12 ఉదయం హైవే-401పై ప్యాసింజర్‌ వ్యాన్‌లో భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.

ఆ సమయంలో ఓ ట్రాక్టర్‌.వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు గాయపడినట్లుగా కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పేర్కొన్నారు.మరణించిన విద్యార్ధులను హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కర్నాపాల్ సింగ్, మోహిత్ చౌహన్, పవన్ కుమార్‌గా గుర్తించారు.

వీరంతా గ్రేటర్ టొరంటో, మాంటోరియల్ ప్రాంతంలో చదువుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు విద్యార్ధులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube