ఏపీలో విస్తరిస్తున్న కరోనా… 21కి చేరుకున్న మొత్తం కేసులు  

21 Corona Positive Cases In Andhra Pradesh - Telugu, Corona Effect, Covid-19, Visakhapatnam

తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి భాగా ఎక్కువగా ఉంది.ప్రతి రోజు పోజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 21 Corona Positive Cases In Andhra Pradesh

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్న తెలంగాణ కరోనా పోజిటివ్ కేసులు 50కి దగ్గరగా ఉన్నాయి.ఇక ఏపీలో కూడా కరోనా పోజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

మొన్న ఒక్క రోజు ఏకంగా ఆరు కరోనా పోజిటివ్ కేసులు నమోదు కాగా మార్చి 29 నాటికి మరో రెండు పోజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పోజిటివ్ నిర్ధారణ కాక ఇప్పుడు వారితో కాంటాక్ట్ అయిన వారిలో కూడా కరోనా పోజిటివ్ కేసులు నమోదు కావడం భయపెట్టే విషయం.

ఏపీలో విస్తరిస్తున్న కరోనా… 21కి చేరుకున్న మొత్తం కేసులు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఏపీలో కరోనా పోజిటివ్ కేసుల సంఖ్య ఆర్ధిక రాజధాని అయిన విశాఖలో ఎక్కువగా వ్యాపించడం గమనార్హం.కొత్తగా నమోదైన రెండు కేసులు కూడా విశాఖలోనే బయటపడ్డాయి.

అందులో ఒకరు విశాఖ వాసి కాగా మరొకరు అరుకు ప్రాంతానికి చెందిన వ్యక్తి.వీరికి కరోనా పోజిటివ్ నిర్ధారణ కావడంతో వీరి ద్వారా ఇంకెంత మందికి వ్యాపించి ఉంటుందో అనే అనుమానంతో పోలీసులు వారు కలిసిన అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అరకు లాంటి ప్రాంతాలలో కరోనా విస్తరిస్తే అక్కడ నియంత్రించడం చాలా కష్టమైన పని ఈ నేపధ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని తాజాగా బయటపడిన పోజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచుతున్నారు.వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరి ఈ కేసుల సంఖ్య ఇంకెంత వరకు పెరుగుతాయో అనేది ఇప్పుడు భయపెట్టే అంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

21 Corona Positive Cases In Andhra Pradesh Related Telugu News,Photos/Pics,Images..