బ్రేక్ లేని ఎంటర్టైన్మెంట్.. సెకండాఫ్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఫస్టాఫ్ ముగిసింది.ఈ క్రమంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

 2022 Second Half Movies List  Second Half Movies, Tollywood, Lavanya Tripathi, H-TeluguStop.com

కొన్ని సినిమాలతో హీరోలకు అది చేదు అనుభవం కూడా ఎదురయ్యింది.అయితే ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా సెకండాఫ్ మీద ఉంది.

ప్రేక్షకులు రాబోయే ఆరు నెలలో విడుదల కాబోయే సినిమాలు ఏంటి అన్న విషయాన్ని చూస్తూ ఉంటే.ఇక హీరోలు దర్శక నిర్మాతలు తమ సినిమాలను సెకండాఫ్ లో విడుదల చేసుకోవాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే సీజన్ కాకపోయినా తమ సినిమాలను థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.ఇప్పుడు ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

అయితే సాధారణంగా జూలై పెద్ద సీజన్ ఏమీ కాదు కానీ వివిధ కారణాలతో మొన్నటివరకు పోస్ట్ పోన్ అయిన సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి.ఈ క్రమంలోనే జూలై 8 వ తేదీన లావణ్య త్రిపాటి లీడ్రోల్ చేసిన హ్యాపీ బర్త్ డే, జూలై 14న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ది వారియర్, ఇక జూలై 15వ తేదీన గుర్తుందా శీతాకాలం, 22వ తేదీన నాగచైతన్య థాంక్యూ, నిఖిల్ కార్తికేయ 2, 29న అడవి శేషు హిట్ 2, రవితేజ రామారావు డ్యూటీ సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయ్.

Telugu Review, Dasara, God, Happy Birt Day, Liger, Nagachaitanya, Nani, Warriror

ఆగస్టు నెలలో కూడా కాస్తయినా గ్యాప్ లేకుండా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి సినిమాలు.ఆగస్టు 5వ తేదీన కళ్యాణ్ రామ్ నటించిన బిందుసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామ, ఆగస్టు 11వ తేదీన సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ యశోద, ఆగస్టు 12వ తేదీన అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్, ఆగస్టు 13వ తేదీన నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆగస్టు 25వ తేదీన విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ సినిమాలు విడుదల కానున్నాయి.ఇక ఇవన్నీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సినిమాలు కావడం గమనార్హం.రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా ఇక సెకండ్ హాఫ్ లో విడుదల చేయాలి భావిస్తున్న సినిమాలు లిస్ట్ కూడా పెద్దగానే ఉంది.

Telugu Review, Dasara, God, Happy Birt Day, Liger, Nagachaitanya, Nani, Warriror

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మారేడుపల్లి నియోజకవర్గం నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కిన ఘోస్ట్.నాని హీరోగా నటిస్తున్న దసరా.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, రవితేజ రావణాసుర, బాలయ్య 105వ సినిమా, సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖుషి సినిమా ఇప్పటివరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ ఇక ఈ సినిమాలు కూడా సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అన్నది అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube