2021 ఇప్పటి వరకు టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే

కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా పెద్ద సినిమాలు విడుదలకు ఆసక్తి చూపడం లేదు.నెలల తరబడి థియేటర్లు మూత పడి ఉన్నాయి.

 2021 Top Collected Movies In Tollywood Details, 2021 Top Movies, Film News, Jath-TeluguStop.com

థియేటర్లు మళ్లీ ఓపెన్‌ చేసినా కూడా జనాలు క్యూ కట్టడం చాలా తక్కువగా కనిపిస్తుంది.గతంలో మాదిరిగా ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు జనాలు వెళ్లడం లేదు.

అన్ని విధాలుగా లెక్కలు వేసుకున్న తర్వాతే సినిమాకు వెళ్తున్నారు.కరోనా కారణంగా సినిమాల విడుదల చాలా తక్కువగా ఉంది.

అయితే తక్కువ సినిమాలు విడుదల అయినా కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్ గలగల ఏమాత్రం తగ్గలేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.ఏ ఇతర భాషల్లో కూడా రాని వసూళ్లు తెలుగు భాష సినిమాలకు వచ్చాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో టాప్‌ సినిమా గా వకీల్ సాబ్‌ నిలిచింది.ఆ సినిమా ఏకంగా 86.5 కోట్ల రూపాయల షేర్‌ ను రాబట్టింది.

పవన్‌ కళ్యాణ్‌ స్టామినా మరియు పెద్ద సినిమాలు లేకపోవడం ఇంకా పలు కారణాల వల్ల వకీల్‌ సాబ్‌ ఆ రేంజ్ లో వసూళ్లు దక్కించుకుంది.

ఇక రెండవ స్థానంలో ఉప్పెన నిలిచింది.సినిమా వంద కోట్ల కు పైగా గ్రాస్ ను రాబట్టినా కూడా షేర్‌ విషయానికి వస్తే 52 కోట్లకు పైమాటే అంటున్నారు.

ఇక మూడవ స్థానంలో నిలిచిన క్రాక్ సినిమా దాదాపుగా 40 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.సంక్రాంతి ముందు విడుదల అయిన క్రాక్‌ సినిమా షేర్‌ ఈ రేంజ్ లో వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు.

రవితేజకు చాలా బూస్టింగ్‌ ఇచ్చిన సినిమా అది.ఇక నాల్గవ స్థానంలో జాతి రత్నాలు నిలిచింది.

Telugu Top, Akhil, Jathi Ratnalu, Krack, Love Story, Pawan Kalyna, Raviteja, Tol

తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన సినిమాగా ఇది ఉంటుంది.కేవలం మూడు నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా 38.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.ఇక చివరగా నాగచైతన్య నటించిన లవ్‌ స్టోరీ 35 కోట్ల రూపాయలతో అయిదవ స్థానంలో నిలిచింది.

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఈ అయిదవ స్థానంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటి వరకు 30 కోట్ల వరకు బ్యాచిలర్‌ దక్కించుకున్నాడు అనేది టాక్.లాంగ్‌ రన్‌ లో వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube