ఈసారి సంక్రాంతి సినిమాలన్నీ చాలా లక్కీ.. ఎందుకంటే?

ప్రతి సంక్రాంతికి చాలా సినిమాలు వస్తాయి.ఎక్కువ శాతం సినిమాలు సంక్రాంతికి మంచి విజయాన్ని సాధిస్తాయి.

 2021 Sankranti Films All Winners , 2021 Sankranti Films , Sankranthi Releases, T-TeluguStop.com

ఎప్పటిలాగే ఈ సారి సంక్రాంతికి సినిమాలు వచ్చే విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని అనూహ్యంగా కరోనా భయం లేకుండా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నా కూడా సినిమాలు మూడు వచ్చాయి.

మూడు తెలుగు సినిమాలకు తోడు ఒక తమిళ డబ్బింగ్ సినిమా కూడా తెలుగు బాక్సాఫీస్‌ ముందుకు వచ్చింది.వరుసగా పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో అసలు వసూళ్లు ఎలా ఉంటాయి అనే విషయమై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కాని సంక్రాంతికి విడుదల అయిన అన్ని సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకు పోతున్నాయి.

Telugu Sankranti, Alludu Adhurs, Krack, Master, Ravi Teja, Telugu, Tollywood-Mov

సంక్రాంతికి ముందే వచ్చేసిన క్రాక్‌ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ సాధించి నిర్మాతకు దాదాపుగా అయిదు కోట్ల లాభాలను తెచ్చి పెట్టాయి.ఇక మాస్టర్‌ సినిమాను తెలుగు డబ్బింగ్ రైట్స్ 9 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.ఆ డబ్బును వారం రోజుల్లోనే మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో రాబట్టాడు.

ఇక రెడ్‌ మరియు అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్‌ కు సిద్దంగా ఉన్నాయి.ఈ రెండు సినిమాలు ఒకటి రెండు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తాయి అంటున్నారు.

వరుసగా వచ్చిన సినిమాలు ప్లాప్ టాక్ దక్కించుకున్నా కూడా వసూళ్ల విషయంలో చాలా పాజిటివ్‌ గా ఉన్నాయి.సినిమాలు విడుదల కాక చాలా నెలలు అవుతుంది.కనుక జనాలు ఏదో ఒక సినిమా చూడాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.అందుకే టాక్‌ తో సంబంధం లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.

ఈ నెలలోనే మరి కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.వాటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube