ఇరవైనాలుగు గంటల్లో....

ఇరవైనాలుగు గంటల్లో అంటే ఒక్కరోజులో ఏం జరిగింది? ఏం జరిగిందంటే…సూర్యప్రతాపానికి రెండు తెలుగు రాష్ర్టాల్లో, ఒడిశాలో కలిపి రెండొందల రెండు మంది ప్రాణాలు కోల్పోయారు.తెలుగు రాష్ర్టాల్లో మృతుల సంఖ్య నూటతొంభై ఎనిమిది.

 202 People Killed In Last 24 Hours-TeluguStop.com

ఈ ఎండాకాలంలో దేశం మొత్తం మీద చనిపోయిన వారి సంఖ్య రెండువేలకు పైగా ఉంది.గత ఇరవైనాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నూటనలభైఆరు మంది చనిపోగా, తెలంగాణలో యాభైరెండు మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఎండాకాలంలో ఇప్పటివరకు ఆంధ్రలో ఒక వెయ్యి ఆరొందల ముప్పయ్‌ఆరు మంది చనిపోగా, తెలంగాణలో ఐదొందల నలభై ఒక్కమంది వడదెబ్బకు బలయ్యారు.మే నెల ముగిసింది.

ఎండలకు సత్తువ కోల్పోయిన జనం వానల కోసం ఎదురు చూస్తున్నారు.ఒకటో తేదీ కల్లా తెలుగు రాష్ర్టాల్లో వానలు పడతాయని అనుకున్నారు.

కాని మరో రెండు మూడు రోజులు ఆలస్యమయ్యేలా ఉంది.ఏది ఏమైనా ఈ వేసవి కాలాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు.

ముఖ్యంగా తెలుగు రాష్ర్టాలను నిప్పులకొలిమి చేసింది.వృద్ధులే కాదు, వయసులో ఉన్నవారు సైతం వడదెబ్బకు ప్రాణాలు వదిలారు.

రెక్కాడితేగాని డొక్కాడని బడుగు ప్రజలు ఎండల్లో కూడా పనిచేయాల్సిందే కదా…! ఎండలకు భయపడి పనిచేయకుండా ఉందామంటే కుదరదు.ఇలాంటివారి ప్రాణాలు దైవాధీనమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube