2019 తెలంగాణలో కాంగ్రెస్ విన్నింగ్ సీట్స్ ఇవే   2019 Elections Congress Target     2017-11-12   01:26:22  IST  Bhanu C

కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో ఈ బ్రదర్స్ చాలా దిఫ్ఫ్రెంట్. కోమటి రెడ్డి ఈ మధ్య అసెంబ్లీ లాబీల్లో రాజకీయాలపై తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తెలంగాణా రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రభుత్వ పాలన మరియూ రేవంత్..గుత్తా అంశాలపై చాలా తీవ్రంగా స్పందించారు. రేవంత్ రాజీనామానికి ఆమోదిస్తే కొడంగల్ లో మా సత్తా ఏమిటో చూపిస్తాం అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 50 సీట్లలో సులభంగా విజయం సాధించడం ఖాయమని..నాయకులు అందరూ కష్టపడి పనిచేస్తే మరో 20 సీట్లు సాదించడం ఖాయం అంటున్నూరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకి చేరువ అయ్యేలా పాదయాత్రలు చేయాలని సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు.ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతుందని చెప్పారు.

అయితే కాంగ్రెస్ అధినాయకత్వం..ఇలా పాదయాత్రలు చేయడానికి అనుమతి ఇవ్వదని. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా అనుమతులు లభించలేదని తెలిపారు..అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాల బలంగా ఉందని..విభజన తరువాత పట్టు కోల్పోయిన ప్రాంతాలలో మళ్ళీ పట్టు బిగుస్తున్నాం అని అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా అనుమతులు ఉంటేనే అమలు చేస్తాం అని తెలిపారు.. మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ బలం పుంజుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్తున్నారు

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.