2018 లో తులారాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తపడితే జీవితంలో తిరుగు ఉండదు   2018 Tula Rasi Telugu Rasi Phalalu     2017-11-15   22:03:36  IST  Raghu V

2018 సంవత్సరంలో తుల రాశి వారికీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికీ సంవత్సరం ప్రారంభంలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అంతేకాక కాస్త దూకుడుగా ఉంటారు. అయితే కుటుంబం ,వైవాహిక జీవితంను ఆస్వాదించాలంటే కొంత నియంత్రణ అవసరం. జనవరి నుంచి మార్చి మధ్య కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఇతరుల సెంటిమెంట్ ని దెబ్బతీయవచ్చు. మీరు పనిచేసే చోట మీకు మంచి వస్తుంది. అలాగే మీ ఆలోచనలు కూడా అందరికి నచ్చుతాయి.


పరిస్థితులను అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మార్చుకొనే సత్తా మీలో ఉంది. మీలో కాస్త బద్ధకం ఉంటుంది. దాన్ని దూరం చేసుకోవాలి. అలాగే సహా ఉద్యోగులు మీతో తటస్థంగా ఉంటారు.వారి సహకారం మీకు ఉండదు. అందువల్ల మీరు సొంత సామర్ధ్యంపై ఎక్కువగా ఆధారపడాలి. జనవరి నుంచి మార్చి మధ్య సంపాదన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒంటరిగా ఉండుట వలన కుటుంబంలో కలవలేక సంతోషానికి కొంచెం దూరం అవుతారు.

కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయించడంలో విఫలం అవుతారు. కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తే మీకు ఇక తిరుగు ఉండదు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. మార్చి తర్వాత మీ వైవాహిక జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకొనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.