ఆ రాష్ట్రంలో బాహుబలి2 రికార్డులకు చెక్ పెడుతున్న చిన్న సినిమా.. ఏం జరిగిందంటే?

2018 Movie Breaks Bahubali2 Record Details Here Goes Viral In Social Media , 2018 Movie, Bahubali2, Kerala, Jude Anthony Joseph, 10 Crore Rupees, 2018, Tollywood, Tovino Thomas

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుంటాయి.ఆ రికార్డులు కొన్ని సందర్భాల్లో సులువుగానే బ్రేక్ అయితే మరికొన్ని సందర్భాల్లో మాత్రం బ్రేక్ కావడం కష్టమవుతుంది.కేరళ రాష్ట్రంలో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాలలో బాహుబలి2( Bahubali 2 ) ఒకటి కాగా ఒక చిన్న సినిమా ఈ సినిమా కలెక్షన్లకు చెక్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 2018 Movie Breaks Bahubali2 Record Details Here Goes Viral In Social Media , 20-TeluguStop.com

2018 అనే చిన్న సినిమా కేరళలో( Kerala ) సాధిస్తున్న కలెక్షన్లు అక్కడి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన 2018 ఇప్పటివరకు 72 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా ఫుల్ రన్ లో ఈ సినిమా మరింత భారీగా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.బాహుబలి2 కేరళలో 73 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.2018 సులువుగానే ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Crore Rupees, Bahubali, Judeanthony, Kerala, Tollywood, Tovino Thomas-Mov

కేరళలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.రేపు తెలుగులో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జూడ్ ఆంథోని జోసెఫ్( Jude Anthony Joseph ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

టోవినో థామస్ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించారు.

Telugu Crore Rupees, Bahubali, Judeanthony, Kerala, Tollywood, Tovino Thomas-Mov

ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.2018 ఇతర భాషల్లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.2018 సినిమా బడ్జెట్ 10 కోట్ల రూపాయల( 10 crore rupees ) కంటే తక్కువ మొత్తమని తెలుస్తోంది.బాహుబలి2 రికార్డులను దాదాపుగా బ్రేక్ చేయడం ద్వారా 2018 సినిమా వార్తల్లో నిలవడం గమనార్హం.2018 ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube