ఈ 6 రాసులలో మీ రాశి ఉందా అయితే 2018 లో మీ స్టార్ తిరిగినట్టే...!   2018 Lo EE 6 Rasula Vallaki Star Tiriginatte     2017-12-25   23:26:57  IST  Raghu V

మనిషి జీవితం మీద నవ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. మానవులు గత జన్మలో చేసిన పాపాల ఆధారంగా తిరిగి జన్మిస్తూ ఉంటారు. మనుషుల అందరి స్థితి ఒకేలా ఉండదు. మనిషి జన్మించిన సమయం ఆధారంగా ఆ సమయంలో ఉన్న గ్రహ స్థితిని బట్టి ఆ మనిషి యొక్క జాతకాన్ని నిర్ణయిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో మేషం,వృషభం,మిథునం,కర్కాటకం,సింహం,కన్య,తుల,వృశ్చికం, ధనుస్సు,మకరం, కుంభం,మీనం అనే 12 రాశులు ఉంటాయి. మనిషి ఈ రాశుల్లో ఎదో ఒక రాశిలో జన్మిస్తాడు.

ఈ 12 రాశులు 12 లక్షణాలను కలిగి ఉంటారు. పుట్టిన రాశిని బట్టి వారికీ ఆయా లక్షణాలు ఉంటాయి. ఈ 12 రాశుల మీద గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరంలో ఈ రాశులవారు ఎలాంటి ప్రభావాన్ని చూడబోతున్నారో తెలుసుకుందాం.

మేష రాశి
ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా మంచి స్థాయిలో ఉంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం చేసే వారికి అనుకున్న విధంగా ప్రమోషన్ వస్తుంది. పెట్టుబడులు బాగా కలిసి వచ్చి ధన లాభం కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావటమే కాకుండా ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. మీరు నాయకుడుగా ఉండి అందరి చేత శెభాష్ అనిపించుకుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా కొంచెం జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు. అది అర్ధం చేసుకొని ముందుకు సాగితే అన్ని ఆనందాలే.


సింహ రాశి
ఈ రాశి వారికి శని పోతుంది. దానితో బాగా కలిసి వచ్చి లాభాల బాట పడతారు. అలాగే ఇప్పటివరకు ఉన్నా మనస్పర్థలు కూడా పోతాయి. సంసార జీవితం చాలా బాగుంటుంది. విద్యార్థులు మాత్రం కొంచెం కస్టపడి చదవాలి.

కన్యా రాశి
ఈ రాశివారికి ఈ కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. తీసుకొనే ప్రతి నిర్ణయం బాగా కలిసి వస్తుంది. అలాగే మంచి గుర్తింపు కూడా వస్తుంది. ధనం కూడా పుష్కలంగా లభిస్తుంది. విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను సాధిస్తారు. పెళ్లి అయిన వారు మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశి వారు కొంచెం వివాదాలకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటారు.

తులా రాశి
జీవితంలో జరిగే సంఘటనలకు కృంగిపోకుండా ముందగుడు వేయాలి. లక్ష్య సాధనతో ముందగుడు వేస్తె ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ ఉండటం వలన ఆర్ధికంగా బలంగా ఉంటారు. ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం మధ్య సంబంధాలు బాగుంటాయి. చేసిన ప్రతి పని కలిసి వస్తుంది.

కుంభ రాశి
ఈ రాశి వారు చాలా సమస్యల నుండి బయట పడతారు. ప్రయాణాలు చేయటం వలన సంతోషాన్ని పొందుతారు. కస్టపడి పని చేయటం వలన మంచి పేరు సంపాదిస్తారు. డబ్బు ఇబ్బంది లేకుండా సంపాదన ఉంటుంది. ఈ 6 రాశుల వారు కొత్త సంవత్సరంలో అదృష్ట వంతులు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.