2018 లో మిధున రాశి వారు ఇంటికి దూరం అవుతారా?   2018 Mithuna Rasi Phalalu     2018-03-21   02:17:38  IST  Raghu V

ఈ రాశి వారికీ ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది. వ్యాపారం అయినా ఉద్యోగం అయినా ఏ రంగంలో ఉన్నా కూడా ఈ రాశి వారికీ బాగా కలిసివస్తుంది. అయితే వీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. అంతేకాక వీరు ఉద్యోగం నిమిత్తం కొంచెం దూర ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది.

ఆలా వెళ్ళటం వలన వీరు కాస్త నిరాసగా ఉంటారు. వీరు ఒక వైపు వృత్తిని మరోవైపు కుటుంబాన్ని సంతులనం చేసుకోవాలి. వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవటానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. ఇవి వారి జీవితానికి ఎంతో సహాయపడతాయి.

వీరు వారి భాగస్వామితో ప్రేమగా ఉంటారు. వారి భాగస్వామి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరి సంపాదనకు తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.

ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరిని ఎక్కువగా కీళ్లనొప్పులు బాధిస్తాయి. వీరు బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారంనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం చాలా ముఖ్యం. వీరు గత సంవత్సరం పడిన కష్ట నష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంటారు. వీరు చేస్తున్న వృత్తిలో మంచి పురోగతి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.