పాపం మెగా హీరోలు

గత మూడు సంవత్సరాలుగా మెగా హీరోస్ ఆడిందే ఆట.రచ్చ తో మొదలై, గబ్బర్ సింగ్ తో మరో ఎత్తుకి వెళ్లి, జులాయి,నాయక్,ఎవడు, అత్తారింటికి దారేది లతో ఇతర హీరోలకి కష్టకాలం తెచ్చిపెట్టింది మెగా ఫ్యామిలి.

 2015 Turns Out To Be A Bad Year For Mega Family-TeluguStop.com

ఎన్టీఆర్ చాలా కాలంగా ఫామ్ లో లేకపోగా, మహేష్ బాబు 1-నేనొక్కడినే, ఆగడు లాంటి వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డాడు.ఇక మెగాఫ్యామిలికి తిరుగే లేదు అనుకుంటున్న తరుణంలో గట్టిగా దెబ్బతీసింది ఈ 2015.

ఏడాది మొదట్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గోపాల గోపాల 41 కోట్ల షేర్ వసూలు చేసింది.ఈ చిత్రానికి 5 నుంచి 6 కోట్ల నష్టం వచ్చింది.

వేసవిలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి 50 కోట్లు రాబట్టినా, 3 కోట్ల నష్టం తప్పలేదు.సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కి రెండు కోట్ల నష్టం వాటిల్లగా, వరుణ్ తేజ్ కంచే కుడా లాభాలు తెచ్చిపెట్టడం అనుమానంగానే ఉంది.

మరోవైపు రామ్ చరణ్ బ్రూస్ లీ 18-20 కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా నిలువనుంది.

మెగాఫ్యామిలి కి అతిపెద్ద పోటిదారుడైన మహేష్ కుడా ఈ ఏడాదే ఫామ్ లోకి రావడం గమనార్హం.

శ్రీమంతుడుతో రికార్డుల బాకిలన్ని తీర్చేసి కొత్త లెక్కలు చూపెట్టాడు మహేష్.మరి వచ్చే ఏడాది మేగాఫ్యామిలికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా లేదా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube