2014లో బాబుకు 103... 2019లో సీట్ల లెక్క ఇదే..!

అవును! ఏపీలో మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ప్ర‌ధానంగా అసెంబ్లీ ఎన్నిక‌లు ఇక్క‌డ అత్యంత ప్ర‌తిష్టాత్మ కం కానున్నాయి.

 103-TeluguStop.com

గ‌త 2014 ఎన్నిక‌ల‌కు 2019లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు మధ్య చాలా వ్య‌త్యాసం కూడా క‌నిపించ‌నుంది.గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధానంగా రెండే విష‌యాలు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేశాయి.

వాటి ఒక‌టి.విభ‌జ‌న అంశం.

రెండు ప‌వ‌న్ మ‌ద్ద‌తివ్వ‌డం అనే అంశం.ఈ రెండు విష‌యాల ఆధారంగానే ప్ర‌జ‌లు ఓటింగ్ చేశారు.

కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పార్టీల పంథాలు మారిపోయాయి.అదేవిధంగా ప్ర‌జ‌ల మ‌దిలో ఆశ‌లు, ఆశ‌యాలు కూడా మారిపోయా యి.దీంతో 2019 ఎన్నిక‌లు అంత ఆషామాషీగా జ‌రిగిపోతాయ‌ని భావించ‌డం లేద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా!

వ‌చ్చే ఏడాది మే 16 నాటికి రిజ‌ల్ట్స్ వెలువ‌డే అవ‌కాశం ఉంది.అంటే… ఖ‌చ్చితంగా ఏడాదిలో రాష్ట్ర పార్టీల భ‌విత‌వ్యం మారిపోతుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత అధికార పార్టీకి ఎన్నిసీట్లు ద‌క్క‌నున్నాయ‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.గ‌త 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 103 స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించింది.

మిగిలిన వాటిలో బీజేపీ 4 చోట్లా, వైసీపీ 68 స్థానాల్లోనూ విజ‌యం సాధించింది.అయితే, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచే స‌త్తా ఉందా? అనేది ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన అంశం.

అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప‌రిస్థితికి, ఇప్పుడు ఎన్నిక‌ల నాటికి ఉన్న ప‌రిస్థితి చాలా తేడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.గ‌త ఎన్నిక‌ల్లో బాబు చాలా బ‌ల‌వంతుడు! ఒక‌ప‌క్క జాతీయ స్థాయిలో బీజేపీ ఆయ‌న‌కు బ‌లాన్ని ఇచ్చింది.

న‌రేంద్ర మోడీ స్వ‌యంగా బాబును కొనియాడారు.ఇక‌, మాస్‌లో గంప‌గుత్త‌గా ఓట్లు రాబ‌ట్టిన ఫ‌లితం ప‌క్కాగా ప‌వ‌న్‌కే చెందుతుంది.

అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌.చంద్ర‌బాబుకే మ‌ద్ద‌తిచ్చారు.

తాను పార్టీ స్థాపించి కూడా ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు.దీంతో జ‌గ‌న్‌కు ఒంట‌రి పోరు తప్ప‌లేదు.

ఇలా ఇంత మంది క‌లిస్తే.బాబు సాధించింది.

కేవ‌లం 103 సీట్లు.

అయితే, జ‌గ‌న్ ఒంట‌రిపోరుతూనే 68 స్థానాల్లో విజ‌యం సాధించాడు.

ఇక‌, వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది.

అన్ని ప‌క్షాలూ బాబుపై యుద్దానికి దిగుతున్నాయి.దీంతో బాబు ఇప్పుడు పొత్తుల మాట అటుంచి నైతికంగా ఒంట‌రి అయ్యాడు.

దీనికితోడు కొన్ని సామాజిక వ‌ర్గాల్లో పార్టీ బ‌ల‌హీనంగా ఉంది.నాడు టీడీపీకి స‌పోర్ట్‌గా నిలిచిన బీజేపీ, జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరు చేస్తున్నాయి.

నాడు టీడీపీకి సాలిడ్‌గా ప‌డిన కాపుల ఓట్లు నేడు చీలిపోనున్నాయి.దీనికి తోడు బీజేపీ కాపు వ‌ర్గానికే చెందిన క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో ఆ వ‌ర్గం కొంత వ‌ర‌కు అయినా బీజేపీ వైపు ఆక‌ర్షితులు అవుతుంద‌ని అంటున్నారు.

దీంతో చంద్ర‌బాబు కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 50 సీట్లు ద‌క్కితే గ్రేటే అని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి అప‌ర చాణిక్యుడు ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube