మెగా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!  

Mega Fans Disappointment With Charan – Srinu Vytla Movie..! -

‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.గోవిందుడు విడుదల కాగానే శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్‌ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం అయ్యింది.ఇటీవలే ఈ సినిమా ప్రారంభం అయ్యింది.

Mega Fans Disappointment With Charan – Srinu Vytla Movie..! -

షూటింగ్‌ ఆలస్యంగా మొదలైనా కూడా సినిమాను మాత్రం ఆలస్యం కాకుండా దసరా కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దానయ్య మరియు దర్శకుడు శ్రీనువైట్ల ప్రకటించారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకు ఈ సినిమా వచ్చే పరిస్థితులు లేవు అని తేలిపోయింది.

ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్‌కు అనేక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ నత్త నడకన జరుగుతుంది.తాజాగా ప్రారంభం కావాల్సిన షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అయ్యింది.బ్యాంకాక్‌లో రామ్‌చరణ్‌ ఫైటింగ్‌లో శిక్షణ పూర్తి కాకపోవడంతో షూటింగ్‌ను వాయిదా వేయడం జరిగింది.

ఇక పలు కారణాలు కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం అవుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.దసరాకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వస్తాడని భావించిన మెగా ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు