అక్కడ కూడా 200 మిలియన్‌ క్రాస్‌ చేసిన అల వైకుంఠపురం ఆల్బమ్‌  

Ala Vaikuntapuramlo, 200 million Cross Ala Vaikuntapuramlo Movie Album, Allu Arjun, Trivikram, Jio Saavan - Telugu 200 Million Cross Ala Vaikuntapuramlo Movie Album, Ala Vaikuntapuramlo, Allu Arjun, Jio Saavan, Trivikram

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం పాటలు ఏ స్థాయిలో రికార్డు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీ హిట్‌ అవ్వడంలో పాటలు కీలకంగా మారాయి.

 200million Cross Ala Vaikuntapuramlo Songs Jio Saavan

సినిమా పాటలు దాదాపు 10 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి.ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఉన్న అల వైకుంఠపురంలోని పాటలు అన్ని కలిపి బిలియన్‌ వ్యూస్‌కు పైగా వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన అల వైకుంఠపురంలోని పాటలు ఇప్పుడు సావన్‌లో కూడా రికార్డు బ్రేక్‌ చేశాయి.

అక్కడ కూడా 200 మిలియన్‌ క్రాస్‌ చేసిన అల వైకుంఠపురం ఆల్బమ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జియో సావన్‌లో కూడా అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటలను విపరీతంగా స్ట్రీమింగ్‌ చేసినట్లుగా ప్రకటించారు.

జియో సావన్‌ అధికారిక ఖాతాలో 200 మిలియన్‌ స్ట్రీమింగ్స్‌ అల వైకుంఠపురంలో ఆల్బంకు వచ్చినట్లుగా పేర్కొన్నారు.ఈ విషయాన్ని థమన్‌ రీ ట్వీట్‌ చేసి వావ్‌ అంటూ స్పందించాడు.

అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ల కాంబోలో వచ్చిన ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందించగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించింది.రికార్డు స్థాయి స్ట్రీమింగ్స్‌ రావడంతో జియో సావన్‌లో కూడా అల రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది.

ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో అంటూ మెగా ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#200Million #Allu Arjun #Jio Saavan #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

200million Cross Ala Vaikuntapuramlo Songs Jio Saavan Related Telugu News,Photos/Pics,Images..