ఆర్ఆర్ఆర్ కు మొదలైన లాభాలు!

ప్రముఖ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ పేరుగాంచిన నిర్మాత డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 200crores Profit For Rrr Digital And Satellite Rights, 200crores, Rrr, Rrr Movie-TeluguStop.com

దానయ్యకి సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.ఒకసారి దానయ్య ఏదైనా ప్రాజెక్టు చేపట్టిన తరువాత ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా ఆ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడం అతని నైజం.

అర్అర్ఆర్ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇదివరకే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణం వల్ల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అంతేకాకుండా ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల కావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.అటు మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈనెల 22వ తేదీన ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.

లాక్ డౌన్ నిబంధనలు సడలించి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించింది.400 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ సినిమాకి, డిజిటల్ అండ్ సాటిలైట్ రైట్స్ 200 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం.దీన్ని బట్టి చూస్తే సినీ నిర్మాత దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు.

ఈ సినిమా వల్ల దానయ్య లాభాల బాటలో ఉన్నారని సినీ వర్గాలలో చర్చ మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube