ఇరవై వేల కే భారీ టీవీ  

20000 For Bigger Tv -

స్మార్ట్ టీవీ… కేవలం టెలివిజన్ చానళ్లలో కార్యక్రమాలు, సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇంటర్నెట్, వివిధ రకాల సామాజిక మాధ్యమాలు, ఈ-మార్కెటింగ్, ఆన్ లైన్ సేవలను అందించే టెలివిజన్.ప్రస్తుతం పేరున్న కంపెనీల స్మార్ట్ టీవీ కొనాలంటే రూ.40 వేలకు పైగానే వెచ్చించాల్సి వుంటుంది.

ఈ పరిస్థితుల్లో ఇండియాకు చెందిన యూవీ, వివిధ రకాల పరిమాణాల్లో స్మార్ట్ టీవీలను అందుబాటు ధరల్లో విడుదల చేసింది.నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, యుప్ టీవీ, ఫేస్ బుక్, ఆక్యూ వెదర్ వంటి యాప్స్ ముందుగానే లోడ్ చేసిన 32 అంగుళాల హెచ్డీ స్క్రీన్ టీవీని రూ.20 వేల ధరకు విడుదల చేసింది.

20000 For Bigger Tv-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదే సమయంలో 40 అంగుళాల టీవీని రూ.30 వేలకు, 55 అంగుళాల టీవీని రూ.52 వేలకు అందించనున్నట్టు తెలిపింది.వీటిని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈఓ దేవితా సరాఫ్ వెల్లడించారు.

యూవీ సంస్థ తన స్మార్ట్ టీవీ రేంజ్ ని ఈ సంవత్సరం జనవరిలో తొలిసారిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

20000 For Bigger Tv- Related....