మ‌న రూ.2వేల నోటు పాకిస్తాన్‌లో ఎంత విలువో తెలుసా..?

మ‌న ప‌క్క‌నే ఉండే పాకిస్తాన్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.వాస్త‌వానికి మ‌న‌కు శత్రు దేశమే అయినా కూడా ఆ దేశంలో జ‌రిగే అనేక విష‌యాల గురించి మ‌న‌కు పెద్దగా తెలియదు.

 2000 Rupee Note Cost In Pakistan Rupee, Indian Notes, Pakistan , India , Pakista-TeluguStop.com

అయితే నిత్యం మ‌న‌తో క‌య్యానికి కాలు దువ్వే పాకిస్తాన్‌ను ఒక ఉగ్రవాదానికి మ‌ద్ద‌తు ఇచ్చే దేశఃగానే చూస్తున్నాం.అయితే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంద‌నే విష‌యాల‌పై అంద‌రికీ ఆస‌క్తిగానే ఉంటుంది క‌దా.

అయితే మ‌రి మ‌న క‌రెన్సీ అక్క‌డ ఎంత విలువ‌? అస‌లు మ‌న ద‌గ్గ‌ర ఉండే నోట్లకు అక్క‌డ ఎలాంటి నోట్లు ఉంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న ఇండియ‌న్ కరెన్సీకి, పాకిస్తాన్ కరెన్సీకి ఎంతో తేడా ఉంటుందంట‌.

మ‌న ద‌గ్గ‌రేమో ఇప్పుడు 1, 2, 5అలాగే 10 ఇలా కాయిన్లు ల‌భిస్తున్నాయి.అలాగే నోట్ల విష‌యానికి వ‌స్తే మాత్రం 10నుంచి మొద‌లుకుని రూ.2000 నోట్ల దాక ఆమ‌ల్లో ఉంటున్నాయి.అయితే పాకిస్తాన్‌లో మాత్రం హయ్యెస్ట్ కరెన్సీ గా రూ.5 వేల నోట్ చెలామణీ అవుతోంది.పాకిస్తాన్‌లో కూడా మ‌న ద‌గ్గ‌ర‌లాగానే రూ .5 నుంచి మొద‌లుకుని రూ .5000 నోట్ల దాకా ఉంటున్నాయి.కాక‌పోతే వారి ద‌గ్గ‌ర వెయ్యి నోటు ఉంటే మ‌న ద‌గ్గ‌ర మాత్రం దానికి బ‌దులుగా రూ.2వేల నోటు ఉంది.

Telugu Rupees, Equels Rupees, India Rupees, India, Indian Notes, Ruppe, Pakistan

అయితే మ‌న ద‌గ్గ‌ర ఉండు ఒక్క‌ రూపాయి పాకిస్తాన్‌లో అయితే రూ.2.29 కి స‌మానంగా ఉంటుందంట‌.అంటే మ‌న ర‌పాయిలో స‌గానికి స‌మానంగా పాకిస్తానీ క‌రెన్సీ ఉంటుందంన్న మాట‌.పాకిస్తాన్‌లో ఇప్పుడు చెలామ‌ణీలో ఉన్న ఒక్క రూపాయి మ‌న ద‌గ్గ‌ర 0.44 పైస‌ల‌కు సమానం. ఇక ఇదే పాకిస్తాన్ రూపాయి డాలర్‌తో పోలిస్తే 0.0059 పైస‌ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని చెబుతున్నారు.ఇక మ‌న ద‌గ్గ‌ర ఉండే రూ.2 వేల నోటు పాకిస్తాన్‌లో రూ.4567.40 రూపాయ‌ల‌కు సమానంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.మ‌న ప‌క్క‌నే ఉన్నా కూడా మ‌న‌కు వారికి చాలా తేడా ఉంద‌న్న మాట‌.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube