కరోనా భయం: మక్కా మూసివేత... కేరళ యాత్రికులకు విమానంలో అనుమతి నిరాకరణ

కరోనా భయం కారణంగా ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న సంగతి తెలిసిందే.దీంతో ఎన్నో దేశాలు తమ దేశంలోకి వివిధ దేశాల పర్యాటకులు రాకుండా నిషేధాలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

 200 Umrah Pilgrims From Kerala Deplaned By Airlines Over Coronavirus Fears-TeluguStop.com

ఇదే కరోనా భయంతో ముస్లింలకు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సౌదీ బయల్దేరిన కేరళకు చెందిన 200 మంది ఉమ్రా యాత్రికులను కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపివేశారు.

వివిధ దేశాల్లోని ముస్లిం సోదరులు వార్షిక హజ్ తీర్థయాత్రకు సిద్ధమవుతున్న సమయంలో సౌదీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులను నిరాశకు గురిచేసింది.మధ్యప్రాచ్యంలో 240 కరోనా వైరస్ కేసులు నమోదైన కారణం చేత సౌదీ అరేబియా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Telugu Umrah Pilgrims, Umrahpilgrims, Coronavirus, Kerala, Makkah, Saudi Arabia,

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సౌదీ ఎయిర్‌లైన్స్‌‌లో 84 మంది, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌లో 104 మంది కేరళ యాత్రికులను సౌదీకి వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు.

Telugu Umrah Pilgrims, Umrahpilgrims, Coronavirus, Kerala, Makkah, Saudi Arabia,

కేవలం జెడ్డా వరకు మాత్రమే కొందరు ప్రయాణికులకు అనుమతి ఉందని తెలిపారు.ఫిబ్రవరి 27న ఉమ్రా యాత్రకు వెళ్లేందుకు 40 మంది చొప్పున రెండు బ్యాచ్‌లకు అధికారులు నిరాకరించినట్లు కాలికట్‌కు చెందిన ఓ ప్రైవేట్ టూర్ ఆపరేటర్ తెలిపారు.5.30కి వెళ్లాల్సిన స్పైస్ జెట్, 11.30కి బయల్దేరాల్సిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానాలు యాత్రికులకు ప్రవేశాన్ని నిరాకరించాయని ఆయన చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube