బిడెన్ ప్రమాణ స్వీకార ఎఫెక్ట్ ....200 మంది భద్రతా సిబ్బందికి కరోనా..!!- 200 National Guard Members Tested Positive Covid

200 National Guards Tested Positive, Joe Biden Inauguration, 200 National Guards ,Corona Positive, Corona Deaths, America, Corona Positive Cases - Telugu 200 National Guards, 200 National Guards Tested Positive, America, Corona Deaths, Corona Positive, Corona Positive Cases, Joe Biden Inauguration

కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిందట అలా ఉంది అమెరికాలోని తాజా పరిస్థితి.అమెరికా అధ్యక్షుడిగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రమాణ స్వీకారం చేసేశారు బిడెన్.

 200 National Guard Members Tested Positive Covid-TeluguStop.com

అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఈ తరహా భద్రతా ఏర్పాట్లు జరగలేదు, అయితే అందుకు కారణం లేకపోలేదు.మళ్ళీ అమెరికా క్యాపిటల్ భవనం పై జరిగిన దాడిలెక్క ఎక్కడ దాడులు జరుగుతాయోననే భయం యంత్రాంగాన్ని వెంటాడింది దాంతో ఈ స్థాయిలోభద్రత ఇవ్వక తప్పలేదు.

నేషనల్ గార్డ్స్, ఇంటిలిజన్స్, స్థానిక పోలీసులు, వాళ్ళు వీళ్ళు, వగైరా వగైరా కలిపి మొత్తం 25వేల మంది పహారా కాశారు.బిడెన్ కూడా అందరికి కృతజ్ఞతలు చెప్తూ తన మొదటి టార్గెట్ కరోనాను అంత చేయడమే అంటూ కొన్ని ఫైల్స్ పై సంతకాలు బరా బరా చేసేశారు.

 200 National Guard Members Tested Positive Covid-బిడెన్ ప్రమాణ స్వీకార ఎఫెక్ట్ ….200 మంది భద్రతా సిబ్బందికి కరోనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కట్ చేస్తే


బిడెన్ కోసం పహారా కాసిన 200 మంది నేషనల్ గార్డ్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.భద్రత కోసం వచ్చిన 25వేల మందిలో 200 మంది నేషనల్ గార్డ్స్ కు కరోన రావడంతో మిగిలిన వారి పరిస్థితిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరూ సైనికుడు జాగ్రత్తగా ఉండాలంటూ అందరికి ఆదేశాలు జారీ చేసేశారు.గంటల వ్యవదిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆందోళనలు జరగకుండా బలగాలు మొహరిస్తే వారికి కరోనా సోకిందని ఆందోళన చెందుతున్నారు.

రోజులు గడిచే కొద్ది ఎంతమందికి కరోనా సోకుతుందోననే టెన్షన్ వాతావరం నెలకొంది.ఇదిలాఉంటే ఇప్పటికే అమెరికాలో రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య 4వేల పై చూలుకే నమోదు అవుతోంది.కేసుల సంఖ్య అయితే ఇక చెప్పనక్కర్లేదు.ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4.24 లక్షలకు చేరుకోగా , కరోన బారిన పడిన వారి సంఖ్య 2.53 కోట్లకు చేరుకుంది.

#200National #America #JoeBiden #200National #Corona Deaths

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు