విడ్డూరం : గర్బవతి అని తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది  

20 Years Old Lady Given Birth To A Baby Without Knowing She Is Pregnant-america,given Birth To A Baby,pain Killers,pregnant,గర్బవతి,స్టాసీ పోర్టర్‌

ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనం అస్సలు నమ్మలేం. అది ఎలా సాధ్యం అంటూ ముక్కున వేలేసుకునేలా ఉంటాయి. కొన్ని సంఘటలు నమ్మశక్యంగా లేకున్నా అలా జరిగి ఉండవచ్చులే అని మనకు మనం సర్ది చెప్పుకుంటాం..

విడ్డూరం : గర్బవతి అని తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది-20 Years Old Lady Given Birth To A Baby Without Knowing She Is Pregnant

కాని కొన్ని సంఘటనలు మాత్రం ఎంత నమ్మాలనుకున్నా నమ్మశక్యంగా ఉండవు. మనకు మనం ఎంత సర్ది చెప్పుకవాలనుకున్నా కూడా అదెలా సాధ్యం అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

ఆ సంఘటన మీరు నమ్మలేరు. ఒక్కసారిగా అవాక్కవాల్సిందే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన 20 ఏళ్ల స్టాసీ పోర్టర్‌ అనే వివాహిత మే 10వ తారీకున డెలవరీ అయ్యింది. డెలవరీ అయితే ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా, అసలు విషయం ఏంటీ అంటే ఆమె డెలవరీ అయ్యే వరకు కూడా తాను ప్రెగ్నెంట్‌ అనే విషయం ఆమెకే తెలియదు.

ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలియకుండానే ఆమె డెలవరీ అయ్యింది. తనకు తాను డెలవరీ చేసుకుంది. మే 10వ తారీకున ఉదయం 4 గంటల సమయంలో ఆమెకు పెయిన్స్‌ మొదలయ్యాయి. మొదట వాటిని నార్మల్‌ అనుకుంది.

ఆ తర్వాత బాగా ఎక్కువ అవ్వడంతో భర్తకు తెలియజేసింది.

పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవాలని భావించింది. కాని పెయిన్‌ కిల్లర్స్‌ సమయానికి లేవు. ఆ తర్వాత కొద్ది సమయంకు ఆమెకు అర్థం అయ్యింది.

తాను డెలవరీ అవ్వబోతున్నట్లుగా తెలుసుకుంది. ఆ సమయంలో మరెక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. బాత్‌ రూం ఫ్లోర్‌పై పడుకోబెట్టి ఆమె భర్త తెలిసిన డాక్టర్‌కు ఫోన్‌ చేశాడు..

అతడి సూచనల మేరకు ఆమెకు డెలవరీ చేశాడు.

20 నిమిషాల పెయిన్స్‌ తర్వాత ఆమె డెలవరీ అయ్యింది. ఇంట్లోనే డెలవరీ అయినా, అత్యంత కఠిన పరిస్థితుల్లో బిడ్డ బయటకు వచ్చినా కూడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆమె ప్రెగ్నంట్‌ అని తెలుసుకోలేక పోవడంకు కారణంను పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు.

ఆమె కడుపు పెరగక పోవడం వల్ల ఆమె ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలుసుకోలేక పోయింది. తమ విచిత్రమైన పరిస్థితి గురించి తెలియజేస్తూ స్టాసీ దంపతులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తమ పాపకు సోఫియా గ్రేస్‌ అనే పేరు పెట్టినట్లుగా వెళ్లడించారు.

తాము తమ కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఉందని, తాము చాలా ప్రత్యేకం, తమ పాప చాలా ప్రత్యేకం అంటూ సంబరపడుతున్నారు ఆ జంట.