భార్య భర్త లమధ్య గొడవలో దూరాడు,చివరికి  

20-year-old Man Intervenes In Couple\'s Fight In South Delhi-

భార్య,భర్త మధ్య గొడవ జరిగినప్పుడు మూడో వ్యక్తి మధ్య వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు.నిజంగా ఆ మాట నిజమే అని అనిపిస్తుంది ఈ తాజా ఉదంతం గురించి తెలుసుకుంటే మాత్రం.ఢిల్లీ లోని సమృద్దపూర్ ప్రాంతంలో ఒక ఘటన చోటుచేసుకుంది...

20-year-old Man Intervenes In Couple\'s Fight In South Delhi--20-year-old Man Intervenes In Couple's Fight South Delhi-

సంజీవ్ పాండే అనే వ్యక్తి కజిన్ తో పాటు నివసిస్తూ రాత్రి పూత ఒక సెక్యూరిటీ గార్డు గా ఒక అపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు.అయితే అతడు పనిచేసే అపార్ట్ మెంట్ లోని ఒక ఫ్లాట్ లో జతిన్ బోరా అనే వ్యక్తి,భార్య, పాప తో కలిసి ఉంటున్నాడు.అయితే అర్ధరాత్రి సమయంలో వారిద్దరూ గొడవపడుతున్నారు.

అంతా నువ్వే చేసావు అంటే నువ్వే చేసావు అంటూ గొడవ పడుతున్నారు.పెద్ద పెద్దగా అరుపులు అరుచుకుంటూ ఎంతసేపటికీ గొడవ సద్దుమణగక పోవడం తో సంజీవ్ వారి ఫ్లాట్ లోకి వెళ్లి బెడ్ రూమ్ లో గొడవపడుతున్న భార్యాభర్తలను ఎందుకు గొడవపడుతున్నారు అంటూ వారించాడు.అయితే కొద్దిసేపటికి అంతా కూల్ అయ్యింది అని, భావించిన సంజీవ్ తిరిగి తన డ్యూటీ చేసుకోవడానికి కిందకు వచ్చేశాడు.

20-year-old Man Intervenes In Couple\'s Fight In South Delhi--20-year-old Man Intervenes In Couple's Fight South Delhi-

అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ కాసేపటికి కత్తి తో కిందకు దిగిన జతిన్ నేరుగా ఆ కత్తిని సంజీవ్ గుండెల్లో పొడిచాడు.అయితే అప్పటికే కాస్త నిద్ర మత్తులోకి జారుకున్న సంజీవ్ఒ క్కసారిగా కళ్లు తెరిచి చూసి ఖంగు తిన్నాడు.రక్తం బొటబొటా కారుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో కత్తిని గుండెల్లో నుంచి వెనక్కి లాగిన జతిన్ తిరిగి దానిని సంజీవ్ తొడ పై గుచ్చి అక్కడ నుంచి నేరుగా తన ఫ్లాట్ లోకి పారిపోయాడు.

అయితే సంజీవ్ పరిస్థితి గమనించిన చుట్టుపక్కల వారు అతడిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు.కానీ సంజీవ్ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న అధికారులు ఫ్రెండ్ ఇంటిలో తలదాచుకున్న జతిన్ ను అతడి మొబైల్ ద్వారా ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.పాపం భార్య భర్తల మధ్య గొడవలో దూరిన సంజీవ్ చివరికి ప్రాణాలనే పోగొట్టుకోవాల్సి వచ్చింది.

20 ఏళ్ల సంజీవ్ రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ పగలు ఒక టీ షాపు లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.