గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ : టాప్ 10 ఫైనలిస్ట్‌లలో భారతీయ విద్యార్ధిని ..!!

ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ 2022 కోసం పోటీపడుతోన్న టాప్ 10 ఫైనలిస్టులలో భారతీయ విద్యార్ధిని అనఘా రాజేశ్ చోటు దక్కించుకున్నారు.ఈమె గోవాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నారు.

 20 Year Old Indian Student Anagha Rajesh Among Global Student Prize Top 10 Final-TeluguStop.com

అలాగే మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల్లోనూ అనఘా చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ అవార్డ్ కోసం 150 దేశాల నుంచి 7000 నామినేషన్లు, దరఖాస్తులు అందాయి.

వీటన్నింటిని దాటుకుని అనఘా టాప్ 10లో నిలవడం విశేషం.

పోషకాహరం, మానసిక ఆరోగ్యం వంటి బహుళ ప్రాజెక్ట్‌లలో ఆమె పరిశోధకురాలిగా పనిచేశారు.

అలాగే కమ్యూనిటీ బిల్డర్‌గా అనఘా గుర్తింపు తెచ్చుకున్నారు.‘యువర్స్ మైండ్‌ఫుల్’ పేరిట ఎన్జీవో సంస్థను స్థాపించిన అనఘా రాజేశ్.

దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.పూర్తిగా యువత భాగస్వామ్యంతో ఈ సంస్థ నడుస్తోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మన ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో సహాయపడే తనతో పాటు టాప్ 10లో నిలిచిన వారికి అభినందనలు తెలిపారు.యువత తమ గళం వినిపించాల్సిన అవసరం వుందని అనఘా అభిప్రాయపడ్డారు.

Telugu Anagha Rajesh, Birla Institute, Gitanjali Rao, Prize, Indian, Kenisha Aro

యువర్స్ మైండ్‌ఫుల్లీ ద్వారా రత్, యూఏఈ, ఆఫ్రికా, యూకేలకు చెందిన 40 మంది యువ బృందంతో కలిసి ఆమె మానసిక ఆరోగ్యంపై పనిచేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో మలాలా ఫండ్‌తో కలిసి మహిళా కార్యకర్తల కోసం mental health resource pack ను సేకరించేందుకు అనఘా పనిచేశారు.త్వరలో ఈజిప్ట్‌లోనూ యువర్స్ మైండ్‌ఫుల్ చాప్టర్‌ను ఆమె ప్రారంభించనున్నారు.ఇకపోతే.అనఘా రాజేశ్‌తో పాటు టాప్ 10 లో నిలిచిన వారి విషయానికి వస్తే భారత సంతతికి చెందిన గీతాంజలి రావు, కెనిషా అరోరా కూడా వున్నారు.ఈ నెలాఖరున న్యూయార్క్‌లో జరిగే UN General Assembly weekలో విజేతను ప్రకటించనున్నారు.అవార్డ్ కింద లక్ష అమెరికన్ డాలర్లను బహూకరిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube