ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో 20 మంది మృతి.. !

ప్రపంచ ప్రజలను కరోనా ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంటే మరోవైపు ఊహించని ప్రమాదాల రూపంలో మృత్యువు వెన్నంటే ఉంటుంది.ఈ క్రమంలో ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒకచోట తీవ్రమైన ప్రమాదాల బారినపడుతూ జనం విపరీతంగా మరణిస్తున్నారు.

 20 Pepoles Killed In Bus Accident-TeluguStop.com

మొత్తానికి గత సంవత్సరం నుండి మరణాల సంఖ్య పెద్దమొత్తంలో పెరిగిన విషయం సృష్టంగా అర్ధం అవుతుంది.

ఇకపోతే పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

 20 Pepoles Killed In Bus Accident-ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో 20 మంది మృతి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ బోల్తాపడటంతో ఈ ఘటన లో సుమారుగా 20 మంది ప్రయాణీకులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు గా సమాచారం.ఇకపోతే ఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారని ఇక్కడి అధికారులు వెల్లడించారట.

కాగా ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.ఇంకా ఈ ప్రమాదానికి సంబంధిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

#Peru #Death #20 Pepoles #Bus Accident

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు