శ్రీవల్లి సాంగ్ రికార్డ్ బ్రేక్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందంటే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్, పోస్టర్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

 20 Million Views For Pushpa Srivalli Lyrical Video Song-TeluguStop.com

ఇక మొదటిసారి బన్నీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుంటే.

 20 Million Views For Pushpa Srivalli Lyrical Video Song-శ్రీవల్లి సాంగ్ రికార్డ్ బ్రేక్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక శ్రీవల్లి పాత్రలో పుష్పరాజ్ భార్యగా నటిస్తుంది.ఇక వీరిద్దరి లుక్ రివీల్ అవ్వగా ఇద్దరు మాస్ లుక్ లో అదర గొడుతున్నారు.

ఇక ఈ మధ్యనే పుష్ప నుండి చిత్ర యూనిట్ శ్రీవల్లి అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా అదిరి పోయే రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక అనే పాటే సూపర్ హిట్ అయ్యిందనుకుంటే ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా సిద్ శ్రీరామ్ నిలిచాడు.

సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడు.ఈ పాట ఐదు భాషల్లో విడుదల అవగా నాలుగు భాషల్లో సిద్ శ్రీరామ్ నే పాట పాడగా ఒక్క హిందీలో మాత్రం జావేద్ అలీ పాడారు.

ఇక శ్రీవల్లి పాటకు ఇప్పటి వరకు 5 భాషల్లో కలిసి 20 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి.ఇంకా ఈ పాట మరిన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

https://youtu.be/5IEbR79kBPY
#Pushpa #Allu Arjun #ViewsPushpa #Sukumar #PushpaSrivalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube