ఇక్కడ వాన చుక్క లేదు...అక్కడ వరదల హోరు

తెలుగు రాష్ర్టాల్లో వాన చుక్క కరువైంది.కరువు ఛాయలు కమ్ముకున్నాయి.

 Floods In Bengal, Odisha, Mizoram And Manipur-TeluguStop.com

రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.మంచినీటి కరువు కళ్లముందు కదలాడుతోంది.

జలాశయాలు ఎండిపోతున్నాయి.కాని ఉత్తర భారతం మాత్రం వానలతో, వరదలతో అతలాకుతలమవుతోంది.

ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.నగరాలకు నగరాలే మునిగిపోతున్నాయి.

కొండచరియలు విరిగిపడుతున్నాయి.మణిపూర్, బెంగాల్‌, ఒడిశా, మిజోరం…ఇలా పలు రాష్ర్టాలు వరదలతో అల్లాడుతున్నాయి.

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఇరవైమంది చనిపోయారు.రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.అనేక చోట్ల వంతెనలు కూలిపోయాయి.

ఎడతెగకుండా వానలు కురుస్తున్నాయి.లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి.

మిగతా రాష్ర్టాల్లో కూడా పరిస్థితి ఘోరంగా ఉంది.బెంగాల్‌, ఒడిశా, మిజోరంలో ఏడు లక్షల మందికి పైగా బాధపడుతున్నారు.

కోల్‌కతా నగరం సగం మునిగింది.దీంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగమేఘాల మీద తిరిగొచ్చారు.

ఈ రాష్ర్టాల్లో లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.వాన అసలు లేకపోయినా కష్టమే.

ఇలా అతి వానలు కురిసినా కష్టమే.వానలు లేకపోతే పంటలు పండవు.

ఎక్కువ వానలు కురిసి వరదలు వస్తే పంటలు కొట్టుకుపోతాయి.ప్రకృతి పగబడితే మనిషి ఏమీ చేయలేడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube