20 మంది భారతీయులు ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయ్యారు..!!!  

20 indians Won Lottery Ticket, Lottery ticket, Indians, Dubai, Lucky Draw - Telugu 20 Indians Won Lottery Ticket, Dubai, Indians, Lottery Ticket, Lucky Draw

ఏదన్నా ఊహించని పరిణామం జరిగి రూపాయికి కూడా నోచుకోని వాడు కొట్లాది రూపాయలకి అధిపతి అయితే నక్క తోక తొక్కాడు రా వీడు అంటుంటారు.కానీ ఏకంగా 20 మంది భారతీయులు ఒకే సారి కోట్లాది రూపాయలని తమ సొంతం చేసుకుంటే మరి వాళ్ళు ఎన్నో నక్క తోకలు తొక్కి ఉండాలి చెప్పండి.

 20 Indians Lottery Ticket Dubai

ఒకరు ఇద్దరికీ లాటరీ వచ్చిందంటే నమచ్చు కానీ 20 మందికి కోట్లాది రూపాయల లాటరీ దక్కడం ఏమిటి అంటూ ఆలోచనలో పడ్డారా అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.

దుబాయ్ లో సుమారు 20 మంది కేరళాకి చెందిన మిత్రులు కలిసి పనిచేస్తున్నారు.

20 మంది భారతీయులు ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయ్యారు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ మిత్రులు అందరూ ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా 6 లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే ప్రతీ ఏడాది వారికీ నిరాశే ఎదురవుతూ ఉండేది.

అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ 20 మంది మిత్రులు లాటరీ టిక్కెట్లని కొనుగోలు చేస్తూనే ఉన్నారు.అయితే ఈ ఏడాది కొనుగోలు చేసిన 101341 అనే టిక్కెట్టు కి ఊహించని విధంగా భంపర్ ఆఫర్ తగిలింది.

ఈ 20 మంది భారత మిత్ర బృందానికి సుమారు 15 మిలియన్ దిర్హామ్స్ అంటే భారత కరెన్సీలో రూ.5 కోట్లు భంపర్ లక్కీ డ్రా తగిలింది.దాంతో ఎన్నో ఏళ్ళ నుంచీ వేచి చూస్తున్న నీరీక్షణకి ఇప్పటికి ప్రతిఫలం వచ్చింది ఉబ్బి తబ్బిబై పోతున్నారు.ఇప్పటికి మేము ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నామని అంటున్నారు.

ఈ భారీ మొత్తాని సమానంగా అందరం పంచుకుని మిగిలిన దాంట్లో కొంత డబ్బుని గల్ఫ్ లో కోవిడ్ వలన కష్టాలు పడుతున్న భారతీయులకి సాయం కోసం అందిస్తామని తెలిపారు.

#Lottery Ticket #Dubai #Indians #Lucky Draw

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

20 Indians Lottery Ticket Dubai Related Telugu News,Photos/Pics,Images..