సింహం మీద 20 హైనాల దాడి.. కానీ ఇంత‌లోనే

అడ‌విలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.అక్క‌డ గెల‌వాలంటే నిత్యం ప్రాణాల‌తో పోరాటం చేయాల్సిందే.

 20 Hyenas Attack On A Lion   But In The Meantime, Hyenas, Lion, Viral Video , Vi-TeluguStop.com

ఒక జంతువుకు ఆక‌లి వేస్తే మ‌రో జంతువు ఆయువు మూడిన‌ట్టే.గెలిస్తేనే ప్రాణాలు.

లేదంటే ఓడిపోతే మాత్రం చావుకు సిద్ధ‌ప‌డాల్సిందే.అయితే అడ‌వి అన‌గానే మ‌నంద‌రికీ ఎక్కువ‌గా గుర్తుకు వ‌చ్చేది సింహం.

అడ‌వికి రాజుగా ప‌రిగ‌ణిస్తున్న సింహానికి ఏ జంతువు అయినా ఎదురైతే ఇంకేమైనా ఉందా.దాని ప్రాణాలు గాల్లో క‌లిసి పోవాల్సిందే.

ఎంత పెద్ద జంతువుల‌ను అయినా ఈజీగా మ‌ట్టు పెట్ట‌గ‌ల‌దు మృగ‌రాజు.

అయితే కొన్ని సార్లు మృగ‌రాజుల అంచ‌నా కూడా త‌ప్పుతుంది.

సింహాల‌న కూడా కొన్ని జంతువులు ఎదురిస్తూ ఉంటాయి.క్రూర జంతువులు కాదండోయ్ సాధు జంతువులే సింహాల‌కు చుక్క‌లు చూపించిన ఘ‌ట‌న‌లు కూడా అనేకం ఉన్నాయి.

సింహాన్ని ఎదురించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.దాన్ని సింగిల్ గా ఏ జంతువు కూడా ఎదురించ‌లేదు.

అందుకు చాలాసార్లు గుంపులు గుంపులుగానే వ‌చ్చి సింహాన్ని బెద‌ర‌గొడుతాయి జంతువులు.అయితే ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో కూడా ఓ 20 హైనాలు ఓ సింహంమీద దాడికి దిగుతాయి.

ఓ చోట కాస్త అలసిపోయిన‌ట్టు ఉన్న సింహం మీద అదును 20 హైనాలు చుట్టుముట్టినట్లు మ‌నం ఈ వీడియోలో చూడవచ్చు.ఒంట‌రిగా ఉన్న సింహాన్ని వేటాడి త‌మ‌కు ఆహారంగా మార్చుకోవాల‌ని హైనాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తాయి.కానీ సింహం కూడా వాటితో అంతే భీక‌రంగా పోరాడుతుంది.హైనాలు మాత్రం దాన్ని విడ‌వ‌కుండా అలాగే దాడి చేయంతో ఆ సింహం స్నేహితుడు మ‌రో సింహం అక్క‌డ‌కు మెరుపు వేగంతో వ‌చ్చి హైనాల మీద దాడి చేస్తుంది.

దీంతో చివ‌ర‌కు ఆ సింహం బ‌తికిపోతుంది.ఇందుకు స‌బంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube