ఈ చిన్నారి పాపకు రక్త దాత కోసం ప్రపచం మొత్తం జల్లెడ పట్టేస్తున్నారు.. చాలా విభిన్నమైన బ్లెడ్‌ గ్రూప్‌

ఈమద్య కాలంలో క్యాన్సర్‌ గురించి తెగ వింటున్నాం, చర్చిస్తున్నాం.పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అందరిని కూడా క్యాన్సర్‌ మహమ్మారి మింగేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 2 Year Old South Florida Girl Search For Planets Rarest Blood Type2-TeluguStop.com

కొందరు మాత్రమే క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.క్యాన్సర్‌కు చికిత్స అంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

భారీగా ఖర్చు చేసినా కూడా కొందరికి అవకాశాలు తక్కువే ఉంటాయి.ఇక కొన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స కూడా ఇబ్బంది కరంగా ఉంటుంది.

ఫ్లోరిడాకు చెందిన జైనాబ్‌ అనే రెండు సంవత్సరాల చిన్నారికి క్యాన్సర్‌ ఎటాక్‌ అయ్యింది.

ఫ్లోరిడాకు చెందిన ముఘల్‌ మరియు రహీల్‌ దంపతుల సంతానం అయిన జైనాబ్‌ కు రెండు సంవత్సరాలు.ఈమద్య జైనాబ్‌ కడుపులో ఒక కణితి ఉందని వైధ్యులు గుర్తించారు.ఆ కణితి క్యాన్సర్‌ అంటూ తాజాగా వెళ్లడయ్యింది.

దాంతో ఆమెకు చికిత్స చేసేందుకు వైధ్యులు సిద్దం అయ్యారు.చికిత్స సమయంలో ఆ చిన్నారికి రక్తం అధిక మొత్తంలో అవసరం అవుతుందట.

అయితే ఆ చిన్నారి రక్తం అత్యంత అరుదైన రక్తంగా వైధ్యులు చెబుతున్నారు.ఆ పాప రక్తంకు ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రక్త దాతల కోసం వెదుకుతున్నారు.

ఫ్లోరిడాలోని బ్లడ్‌ బ్యాంక్‌ ప్రస్తుతం పలు దేశాల్లో ఈ రక్తం గురించిన వివరాలను తెలుసుకుంటుంది.జైనాబ్‌కు కావాల్సిన రక్తం చాలా ప్రత్యేకమైదనట.ఆ రక్తంకు ఉండాల్సిన లక్షణాలు ఏంటీ అంటే… ఇండియా, పాకిస్తాన్‌, ఇరాన్‌ దేశాలకు చెందిన వారి రక్తం మాత్రమే ఆమెకు సెట్‌ అవుతుందట.ఇక వారి రక్తం గ్రూప్‌ ఓ లేదా ఏ మాత్రమే అయ్యి ఉండాలి.

ఈ రెంటితో పాటు వారి ఎర్ర రక్తకణాల్లో ఖచ్చితంగా ఇండియన్‌ బి అనే యాంటీజైన్‌ ఉండాలని వైధ్యులు చెబుతున్నారు.ఇన్ని లక్షణాలు ఉన్న డోనర్‌ దొరకడం చాలా కష్టం అయ్యింది.

ఇప్పటి వరకు ఇద్దరిని పట్టుకున్నారట.జైనాబ్‌కు చికిత్స సమయంలో ఎక్కువ రక్తం అవసరం కనుక మరో ఎనిమిది మంది దొరికితే చికిత్స మొదలు పెడతామని వైధ్యులు చెబుతున్నారు.

జైనాబ్‌ తండ్రి దాతల కోసం జల్లెడ పడుతున్నాడు.ముద్దులొలికే చిన్నారి పాపకు ఎంత కష్టం వచ్చిందో.!

image.png

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube