కెనడా ఫెడరల్ ఎన్నికలు: వ్యాక్సిన్ వ్యతిరేక వర్గాలు.. ట్రూడోకు షాకిస్తాయా..?

ఫెడరల్ ఎన్నికలకు రోజుల ముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇబ్బందుల్లో పడ్డారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన నిరసనలను ఎదుర్కొంటున్నారు.

 2 Weeks Before Elections, Justin Trudeau Appears To Be In Trouble , Canada, Prim-TeluguStop.com

అంతేకాదు ప్రధానిపై ఓ వ్యక్తి రాళ్లు సైతం విసిరాడు.సెప్టెంబర్ 20న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ట్రూడో చాలా మెరుగైన స్థితిలో వున్నారు.

అలాగే సర్వేల ప్రకారం.కన్జర్వేటివ్ నేత ఎరిన్ ఓ టూల్‌తో పోలిస్తే ట్రూడోకే విజయావకాశాలు మెండుగా వున్నాయని తేలింది.

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మంచి ఫలితాలు రాబట్టడంతో ప్రజలు మూడోసారి ఆయనకు అధికారాన్ని కట్టబెడతారని అనేక సర్వేలు అంచనా వేశాయి.కానీ ఆగస్టు 15న టీకాలకు సంబంధించిన ప్రకటన తర్వాతి నుంచి అతని ప్రచారానికి ఆశించినంత స్పందన రావడం లేదు.

దీంతో మెజారిటీ ప్రభుత్వ అధిపతిగా మరోసారి అధికారాన్ని అందుకోవాలనే ట్రూడో ఆశలు నెరవేరడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ట్రూడోకు ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం ఎదురైంది.

అంటారియో ప్రావిన్స్‌లోని టోరంటోకు నైరుతి నగరమైన లండన్‌లో ఒక కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తుండగా.కొందరు నిరసనకారులు ఆయనను అడ్డుకున్నారు.కరోనా వ్యాక్సినేషన్‌, ఇతర సంక్షోభాలపై వారు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇదే సమయంలో కొందరు ట్రూడోపై రాళ్లు విసిరినట్లుగా టెలివిజన్ ఫుటేజ్‌లో కనిపించింది.

అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఈ పరిణామంతో ట్రూడో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.

ఆ తర్వాతి రోజు మీడియాతో మాట్లాడిన ఆయన తనపై రాళ్లు పడినట్లు వెల్లడించారు.కొందరు తనపై తీవ్ర ఆగ్రహంతో వున్నారని.

కానీ.రాజకీయ ర్యాలీలలో వస్తువులను విసిరివేయడం, ఇతరులకు అపాయం కలిగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రూడో హితవు పలికారు.

మరోవైపు ప్రధానిపై దాడిని ప్రతిపక్షనేత ఓ టూల్, న్యూడెమొక్రాటిక్ నాయకుడు జగ్మీత్ సింగ్ ఖండించారు.

Telugu Weeks Bee, Canada, Erin Tool, Jagmeet Singh, Justintrudeau, London, Nanos

ఇదే సమయంలో మంగళవారం విడుదలైన నానోస్ సర్వే ప్రకారం.ట్రూడోకు ఓ టూల్ గట్టిపోటినిస్తున్నట్లు తేలింది.లిబరల్స్‌కు 34 శాతం, టోరీలకు 32 శాతం మంది ప్రజలు మద్ధతుగా వున్నట్లు సర్వే అంచనా వేసింది.

అయితే ఈ నిరసనలు వ్యాక్సిన్ వ్యతిరేక వర్గాలే చేస్తున్నట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube